Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

alliance facing setback for Allocation of Glass Symbol To Janasena Rebels
కూటమికి గుచ్చుకున్న గాజు గ్లాసు!

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి మరో తల నొప్పి మొదలైంది. టీడీపీ, జనసేన పార్టీ రెబల్స్‌ ఇస్తున్న షాక్‌కు కూటమికి గాజు గ్లాసు గుచ్చుకుంటోంది. గాజు గ్లాసుతో టీడీపీ, జనసేన రెబల్స్‌ పోటీలోకి దిగుతున్నారు. తాజాగా గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్‌గా వాడుకోవచ్చని ఈసీ వర్గాలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈసీపై.. టీడీపీ, బీజేపీ పార్టీల ఒత్తిడి ఫలించదు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వ్యవహరించింది.దీంతో  21 అసెంబ్లీ చోట్ల జనసేన అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తుండగా.. ఈసీ ప్రకటనతో మిగిలిన చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించే అవకాశం ఉంది. కాగా, టీడీపీ, జనసేన రెబల్స్‌.. గాజు గ్లాస్ గుర్తుతోనే కూటమికి ధమ్కీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విజయనగరం టీడీపీ రెబల్ మీసాల గీతకు, జగ్గంపేట జనసేన రెబల్ సూర్యచంద్రకు ఈసీ గాజు గ్లాస్ కేటాయించింది. ఇక.. ఎస్‌ కోటలో జనసేన రెబల్ కొట్యాడ లోకాభిరామకోటి గాజు గ్లాస్‌తో పోటీకి దిగుతున్నారు. మరోవైపు.. టీడీపీకి పలు నియోజకవర్గాల్లో రెబెల్స్ బెడద తప్పటం లేదు. విజయనగరం, ఉండి, పోలవరం, పెనుగొండ, హిందూపురంలో బరిలో రెబల్ అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు. సినీనటుడు బాలకృష్ణపై పరిపూర్ణానంద స్వామి, పరిటాల సునీతపై ప్రొఫెసర్ రాజేష్, అదితి గజపతిపై మీసాల గీత , జ్యోతుల నెహ్రూపై సూర్యచంద్ర,  రఘురామకృష్ణంరాజుపై ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివ రామరాజు, పోలవరంలో టీడీపీ రెబల్ మొడియం సూర్యచంద్రరావు బరిలో నిలుస్తున్నారు. 

Ysrcp Leaders Complaint On Chandrababu Naidu To Ec
చంద్రబాబుపై ‘ఈసీ’కి వైఎస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు

సాక్షి,తాడేపల్లి: సీఎం​జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి(సీఈవో) ముఖేష్‌కుమార్‌ మీనాకు వైస్‌ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నారాయణమూర్తి సోమవారం సీఈవోను కలిశారు. ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎంను చంపాలని మాట్లాడటం దారుణమన్నారు. ‘చంద్రబాబు వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌(ఈసీ)కి ఫిర్యాదు చేశాం. ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ల ద్వారా చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఫిర్యాదు చేశాం.ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై తప్పుడు వీడియోను ప్రచారం చేశారు. పృథ్విరాజ్,టీడీపీ,జనసేనపై చర్యలు తీసుకోవాలని కోరాం. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఆ పార్టీలు మళ్లీ మా మీద ఆరోపణలు చేస్తున్నాయి’ అని అన్నారు. 

Rishabh Pant holds edge over Hardik Pandya for T20 World Cup vice captaincy role: Reports
హార్దిక్‌ పాండ్యాకు బిగ్‌ షాక్‌.. టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా పంత్‌!?

టీ20 వరల్డ్‌కప్‌-2024కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ తమ జట్టును మే 1న ప్రకటించనుంది. ఇక ఇప్పటికే  వరల్డ్‌కప్‌ కోసం తుది జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ చైర్మెన్‌ అజిత్ అగార్కర్, భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. అయితే వరల్డ్‌కప్‌ జట్టు ఎంపిక చేసే క్రమంలో బీసీసీఐ సెలక్టర్లు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలను వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌కు అప్పగించేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు రోహిత్‌ డిప్యూటీగా వ్యవహరించిన హార్దిక్‌ పాండ్యాపై సెలక్టర్లు వేటు వేసినట్లు సమాచారం. ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా విఫలమయ్యాడు. కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా హార్దిక్‌ నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు హార్దిక్‌ను వైస్‌ కెప్టెన్సీ నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇక 14 నెలల తర్వాత తిరిగి రీ ఎంట్రి ఇచ్చిన రిషబ్‌ పంత్‌ అదరగొడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంత్ ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌లలో 371 పరుగులు చేశాడు. కెప్టెన్సీ పరంగా కూడా పంత్‌ ఆకట్టుకుంటున్నాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో కొనసాగుతోంది.

Ola Cabs Ceo Hemant Bakshi Quits In Three Months
చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్‌ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు

ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ఓలా క్యాబ్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే ఆ సంస్థ సీఈఓ పదవికి హేమంత్ బక్షి రాజీనామా చేసినట్లు సమాచారం.  దీంతో పాటు సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఓలా క్యాబ్స్‌ దాదాపు 200 మంది ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయిఐపీఓకి ఓలా ఓలా క్యాబ్స్‌ ఐపీఓ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్స్‌తో ఓలా క్యాబ్స్‌ ఇటీవలే చర్చలు నిర్వహించింది. మరో రెండు మూడు నెలల్లో సెబీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్‌ ఇప్పటికే ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది.ఈ తరుణంలో సీఈఓ రాజీనామా, ఉద్యోగుల తొలగింపు అంశం ఓలా క్యాబ్స్‌ చర్చాంశనీయంగా మారింది. కాగా, ఓలా క్యాబ్స్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 

SC stays CBI probe against Bengal officials teachers recruitment case
సీఎం మమత సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఊరట

ఢిల్లీ: టీచర్ల నియామకాలకు సంబంధించిన కేసులో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. 24 వేల టీచర్ల నియామకాన్ని పూర్తిగా  రద్దు చేసి, సీబీఐ విచారణ చేపట్టాలని కోల్‌కతా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును టీఎంసీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో  సవాల్‌ చేసింది. ఈ క్రమంలో సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌కు చెందిన ప్రభుత్వ అధికారులపై లోతుగా దర్యాప్తు చేయాలన్న సీబీఐకి ఇచ్చిన ఆదేశాలపై తాజాగా స్టే విధించింది.2016 నాటి టీచర్లు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ రిక్రూట్‌మెంట్‌లో  అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అప్పటి మొత్తం రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేయాలని... ఇప్పటివరకు టీచర్లు తీసుకున్న జీతాలను వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు  ఇచ్చింది. ఇక ఈ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియపై పశ్చిమ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ను మరింత దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. కోల్‌కత హైకోర్టు తీర్పుపై దీదీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో తాజాగా సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసుపై సుప్రీం కోర్టు తదుపరి విచారణను మే 6 తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే ఈ వ్యవహరంలో సీబీఐ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ, పశ్చిమ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌లోని పలువురు అధికారులను సీబీఐ అరెస్ట్‌ చేయటం గమనార్హం.

CM Jagan Serious Comments At Ponnur Meeting Guntur
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్‌

సాక్షి, గుంటూరు: చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు ఎలాంటివాడో చెప్పడానికి 2014 కూటమి మేనిఫెస్టో సరిపోతుందని మండిపడ్డారు. విలువలు, విశ్వసనీయత లేని బాబు.. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడని విమర్శించారు. గుంటూరు పొన్నూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్‌.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై నిప్పులు చెరిగారు.జననేత రాకతో పొన్నూరులో పండుగ వాతావరం నెలకొంది. సీఎం నినాదాలతో ప్రచార సభ మార్మోగిపోయింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతుందన్నారు. ఈ యుద్ధంలో ఓ వైపు కౌరవ సేన, దృష్ట చతుష్టయం ఉందని విమర్శించారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసిన చరిత్ర ఆ కూటమిని దుయ్యబట్టారు. ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు, ఉన్నాయని ఒక వదినమ్మ, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.పేదవాడికీ మేలు చేసిన చరిత్రలేని వీళ్లంతా కూటమిగా చేరి ఇంటింటికీ మంచి చేసిన ఒకే ఒక్కడైన మీ జగన్‌తో యుద్ధం చేస్తున్నారన్నారు. వైఎస్‌  జగన్‌ నమ్ముకున్నది మిమ్మల్ని(ప్రజలు), పైనున్న ఆ దేవుడినే అని తెలిపారు.  జగన్‌ పొత్తు ప్రజలతోనే ఉంన్నారు. ఈ ఎన్నికలు రాబోయే  ఐదేళ్లకు ప్రజల ఇంటి అభివృద్ధిని నిర్ణయించేవన్నారు. పేదల తలరాతలను నిర్ణయించేవని చెప్పారు. వైఎస్‌ జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని.. పొరపాటున చంద్రబాబుకు ఓటు  వేస్తే పతకాలన్నీ ఆగిపోతాయని తెలిపారు.సీఎం జగన్‌ పూర్తి ప్రసంగం విశ్వసనీయత ఉన్న ఈ ప్రభుత్వం మీద విలువలు లేని చంద్రబాబు ఎలా నోరుపారేసుకుంటున్నారో వింటున్నారు కదా14 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేశాడో చెప్పకుండా జగన్‌ను తిడుతున్నాడుచంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నాడుపోయేకాలం వచ్చినప్పుడు విలన్‌లందరికీ హోరో బచ్చాలనే కనిపిస్తాడునువ్వు బచ్చా అంటున్న నేను ఎన్నికల్లో ఒంటరిగా నిలబడి ధైర్యంగా పొరాడుతున్నా14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు  ఏం చేశాడో చెప్పుకోలేకపోతున్నాడుచంద్రబాబు పేరు చెబితే గుర్తు వచ్చే ఒక్కమంచి పథకం అయినా ఉందా?14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ప్రజలకు తాను చేసిన మేలు చెప్పి ఓట్లు ఎందుకు అడగలేకపోతున్నాడు?మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేాశా అని చెప్పే చంద్రబాబు పేదవాళ్లకు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా ఉందా?బచ్చా అంటున్న జగన్‌ను చూసి.. బాబు ఎందుకు బయపడుతున్నాడు?బచ్చాను ఎదుర్కొనేందుకు ఇన్ని పార్టీలతో పొత్తు ఎందుకు?చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?అమ్మ ఒడి, చేయూత, ఆసరా, సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, వాహనమిత్ర, పెన్షన్‌ వంటి పథకాలు నువ్వు ఎందుకు చేయలేదు?ఐదేళ్లలో నేను అమలు చేసిన పథకాలనే అమలు చేస్తానని ఎందుకు చెబుతున్నావు?రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా?గత మేనిఫెస్టోలో చెప్పినవి 99 శాతం హామీలు అమలు చేశాంలంచాలు, వివక్ష లేకుండా రూ. 2 లక్షల 70 వేల కోట్లు అందించాంనాడు-నేడుతో విద్యా, వైద్య రంగంలో మార్పులు తీసుకొచ్చాం.31 లక్షల ఇళ్ల పట్టాలు,. 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఈ 58 నెలల కాలంలోనే జరిగింది.నా కేబినెట్‌లో‌  68శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు.58 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం200 స్థానాల్లో 100 టికెట్లు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే ఇచ్చాపేదల భవిష్యత్తు మరో రెండడుగులు ముందుకు వేసేలా 2024 మేనిఫెస్టో.

Entire chiranjeevi family to campaign for Pawan kalyan
ఒక్కడి కోసం ఫ్యామిలీ మొత్తం దిగింది

పార్టీ పెట్టి పుష్కరం దాటినా అసెంబ్లీ  గేటును తాకలేకపోయిన పవన్ కళ్యాణ్ను ఈసారైనా గేటు దాటించేందుకు ఆ ఫ్యామిలీ మొత్తం శ్రమిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలుమార్లు పిఠాపురంలో పర్యటించారు. వర్మ కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ.. మొత్తానికి  తనను అసెంబ్లీకి పంపే బాధ్యత వర్మదే అని పూర్తిగా సరెండర్ అయ్యారు పవన్. ఇక నాగబాబు.. ఇంకా జబర్దస్త్ టీమ్ ఆది, గెటప్ శ్రీను ఇలా చాలామంది అక్కడ ప్రచారం చేస్తూనే ఉన్నారు. దీంతోబాటు మొన్న వరుణ్ తేజ్ సైతం రాడ్ షో నిర్వహించి బాబాయ్‌ను గెలిపించాలని కోరారు.ఇది కూడా సరిపోవడం లేదని భావించిన పవన్ ఇక ఏకంగా తన పెద్దన్న చిరంజీవిని సైతం రంగంలోకి దించుతున్నారు. తానూ రాజకీయాలకు దూరమని, అసలు పక్క రాష్ట్ర పాలిటిక్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని, తానిప్పుడు పూర్తిగా సినిమాల మీద దృష్టిపెట్టానని, తనను పాలిటిక్స్‌లో ఇన్వాల్వ్ చేయవద్దని ఆమధ్య మీడియాముఖంగా ప్రజలకు వివరణ ఇచ్చారు. ఐతే ఇప్పుడు పవన్ పరిస్థితి దారుణంగా ఉందని రిపోర్ట్స్ వస్తున్నా తరుణంలో చిరంజీవి ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబులతో కూర్చుని ఒక వీడియోను సైతం రిలీజ్ చేసారు.ఇక అవనీ కాదు కానీ నేనే వస్తాను అని ఫిక్స్ అయిన చిరంజీవి ఇప్పుడు పిఠాపురం వస్తున్నారు. త్వరలో అయన ప్రచారం చేస్తారు. వాస్తవానికి ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పవన్ మీద పోటీ చేస్తున్న వంగా గీత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచారు. అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా వర్మ పోటీ చేశారు. ఆనాడు చిరంజీవి వంగా గీతకు పిఠాపురంలో ప్రచారం చేశారు. అప్పుడు గీత ఏకంగా వర్మను ఓడించి అసెంబ్లీకి వెళ్లారు.  అయితే ఆ వంగా గీత ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున మళ్ళీ అదే పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఐతే ఇప్పుడు అదే చిరంజీవి గీతకు వ్యతిరేకంగా తమ్ముడు పవన్ కోసం ప్రచారం చేస్తున్నారు. గతంలో గీతను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేసిన చిరంజీవి ఇప్పుడు అదే గీతను ఓడించాలంటూ తమ్ముడి కోసం ప్రచారం చేయబోతున్నారు. మొత్తానికి సీఎం వైఎస్ జగన్ ప్రభావంతో పవన్‌కు ఓటమి భయం పట్టుకుంది. దానికితోడు స్థానికురాలు అయిన గీతను ఓడించడం తనకు అసాధ్యం అని పవన్ కు అర్థం కావడంతో కనీసం జీవితంలో ఒకసారి అయినా ఎమ్మెల్యే అవ్వాలన్న జీవితాశయం నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.:::: సిమ్మాదిరప్పన్న

World tallest woman Maria Feliciana dos Santos dies
ప్రపంచంలోనే అతిపొడవైన మహిళ కన్నుమూత

ప్రపంచంలోని అతిపొడవైన మహిళల్లో ఒకరిగా ఖ్యాతిగాంచిన బ్రెజిల్‌కు చెందిన మరియా ఫెలిసియానా దోస్‌ శాంటోస్‌ (77) కన్ను మూశారు. 'క్వీన్ ఆఫ్ హైట్'గా ఫెలిసియానా డాస్ శాంటోస్ అనారోగ్యంతో అరకాజులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. న్యుమోనియాతో బాధపడుతున్న చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.ఆమెమరణంతో బ్రెజిల్ వాసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అభిమానులు, రాజకీయ నాయకులు, ఇతర అధికారులు,  ఆమె మృతిపై సంతాపం ప్రకటించారు.  ఈ సందర్భంగా అరకాజు మేయర్ ఎడ్వాల్డో నోగ్వేరా రాజధాని నగరంలో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.యుక్త వయసులో ఏకంగా 7 అడుగుల 3.8 అంగుళాల ఎత్తు పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా ఏళ్లపాటు ఆమెను ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన మహిళగా నిలిచారు. అయితే ఆ తర్వాతి కాలంలో ఆమె ఎత్తు కాస్త తగ్గుతూ వచ్చారు.గాయని, బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి మారియా తన టీనేజీలో అసాధారణ రీతిలో ఎత్తు పెరిగింది. యుక్త వయసులో ఆమె దేశంలోని వివిధ నగరాల్లో జరిగే సర్కస్‌లలో పనిచేస్తూ వీక్షకులను అబ్బురపరిచేంది.   ఆ తరువాత జాతీయంగా అంతర్జాతీయంగా పాపులర్‌ అయింది. 1960లో క్వీన్‌ ఆఫ్‌హైట్‌ బిరుదు గెలుచుకోవడంతో బ్రెజిల్‌ అంతటా ఆమె పేరు మార్మోగింది. అలాగే 2022 మేలో బ్రెజిల్‌లోని మ్యూజియం ప్రవేశద్వారం వద్ద మారియా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం. కాగా ఆమె భర్త అష్యూయిర్స్ జోస్ డోస్ శాంటోస్‌.  వీరికి ముగ్గురు పిల్లలు.   మరియా తండ్రి, ఆంటోనియో టింటినో డా సిల్వా, 7 అడుగుల 8.7 అంగుళాలు, ఆమె తాత 7 అడుగుల 5.4 అంగుళాల ఎత్తు ఉండే వారట. 

Credit Cards Use Pay For Utility Bills Banks Extra 1 Percent Charges From May 1st
మారిన క్రెడిట్‌ కార్డ్‌ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..

క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులకు ముఖ్య గమనిక. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డ్‌ లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.ఇటీవల ఎస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లు మే 1 నుంచి తమ క్రెడిట్‌ కార్డ్‌ నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రసిటీ బిల్‌, వాటర్‌ బిల్‌, గ్యాస్‌ బిల్‌ చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.దీంతో మీరు ఎస్‌బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి నెలవారీ కరెంట్‌ బిల్లు రూ.1500 చెల్లిస్తుంటే అదనంగా రూ.15 చెల్లించాల్సి ఉంటుంది.అయితే, వినియోగదారులు ఎస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై రూ.15,000, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై రూ. 20,000 ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. లిమిట్‌ దాటితే పైన పేర్కొన్న వన్‌ (ఒకశాతం) పర్సెంట్‌ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. 18 శాతం జీఎస్టీని సైతం చెల్లించాల్సి ఉంటుంది.    

కావ్యా మారన్‌ (PC: IPL)
ఎంత పనిచేశావు కమిన్స్‌!.. కావ్య రియాక్షన్‌ వైరల్‌

పవర్‌ హిట్టింగ్‌తో దుమ్ములేపుతూ ఐపీఎల్‌-2024లో రికార్డులు సృష్టించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతోంది. బారీ విజయాల తర్వాత తొలుత ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన ప్యాట్‌ కమిన్స్‌ బృందం.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో చిత్తైంది.చెపాక్‌ వేదికగా 78 పరుగుల తేడాతో ఓడి.. ఐపీఎల్‌ చరిత్రలోనే తమ భారీ పరాజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌ చూస్తున్నంత సేపు అసలు బ్యాటింగ్‌ చేసేది సన్‌రైజర్స్‌ జట్టేనా అనేంత మందకొడిగా బ్యాటింగ్‌ సాగింది. Batting 🤝 Bowling 🤝 Fielding @ChennaiIPL put on a dominant all-round performance & continue their good show at home 🏠 Scorecard ▶️ https://t.co/uZNE6v8QzI#TATAIPL | #CSKvSRH pic.twitter.com/RcFIE9d46K— IndianPremierLeague (@IPL) April 28, 2024 అదే విధంగా.. తొలుత ఫీల్డింగ్‌ చేసిన సమయలోనూ సన్‌రైజర్స్‌ ఏమాత్రం ఆకట్టులేకపోయింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ సహ యజమాని కావ్యా మారన్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.చెపాక్‌లో చెన్నైతో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు స్కోరు చేసింది.ఓపెనర్‌, కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్ 98 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. అయితే, గైక్వాడ్‌ 97 పరుగుల వద్ద ఉన్నపుడు రనౌట్‌ అయ్యేందుకు ఆస్కారం ఏర్పడింది.కానీ సన్‌రైజర్స్‌ ఫీల్డర్ల తప్పిదం వల్ల అతడు బతికిపోయాడు. చెన్నై ఇన్నింగ్స్‌ పందొమ్మిద ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఉనాద్కట్‌ బౌలింగ్‌లో నాలుగో బంతిని అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ దిశగా.. ఆఫ్‌ కట్టర్‌గా సంధించగా..  గైక్వాడ్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు.బంతిని అందుకున్న కమిన్స్‌ వికెట్లకు గిరాటేయడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో గైక్వాడ్‌ రెండు పరుగులు తీసుకుని సింగిల్‌ తీసి రెండో పరుగు పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కావ్యా మారన్‌ స్పందిస్తూ.. ‘‘నో.. దేవుడా ఎంత పనిపోయింది’’ అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.pic.twitter.com/eBuDpO6WgK— Cricket Videos (@cricketvid123) April 28, 2024

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement