బ్రహ్మాజీ కుమారుడు ‘గుట్టు చప్పుడు’ టీజర్‌ | Guttu Chappudu Movie Teaser Out Now | Sakshi
Sakshi News home page

బ్రహ్మాజీ కుమారుడు ‘గుట్టు చప్పుడు’ టీజర్‌

Apr 29 2024 5:23 PM | Updated on Apr 29 2024 5:26 PM

Guttu Chappudu Movie Teaser Out Now

డాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై  ‘గుట్టు చప్పుడు’ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. టాలీవుడ్‌ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావ్‌ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్‌గా ఆయేషాఖాన్‌ నటిస్తుంది. రొమాంటిక్‌ మాస్‌ యాక్షన్‌ లవ్‌, ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని మణీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.  హనుమాన్‌ చిత్రంతో పాన్‌ ఇండియా సంగీత దర్శకుడిగా మారిన గౌర హరి సంగీత సారథ్యంలో వస్తున్న ఈ సినిమాను డాక్టర్‌ లివింగ్‌స్టన్‌ నిర్మిస్తున్నారు.

బ్రహ్మాజీ మాట్లాడుతూ... 'టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్‌ చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకూ పూర్తయినట్టు ఉంది. టీజర్‌ను సాయి దుర్గాతేజ్‌ ఆన్‌లైన్‌లోను, నేను ఆఫ్‌లైన్‌లోను విడుదల చేయడం సంతోషంగా ఉంది. మా అబ్బాయి నటిస్తున్న 3వ సినిమా ఇది. మంచి నిర్మాత, టెక్నీషియన్స్‌ కుదిరారు. భారీ బడ్జెట్‌తో తీశారు.ఈ టీజర్‌ చూసిన తర్వాత సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఇందులో ఎందుకో గానీ నాకు మాత్రం క్యారెక్టర్‌ ఇవ్వలేదు' అని నవ్వుతూ అన్నారు.

నిర్మాత లివింగ్‌స్టన్‌ మాట్లాడుతూ... 'డైరెక్టర్‌ మణీంద్రన్‌ కథ చెప్పినప్పుడు ఎగ్జైట్‌గా ఫీలయ్యా. ఆయనతో నాకు 12 సంవత్సరాల అనుబంధం ఉంది. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు మంచి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌తోనే చేయాలని ముందే డిసైడ్‌ అయ్యాము. అందుకే పాన్‌ ఇండియా రేంజ్‌కు ఎదిగిన సంగీత దర్శకులు హరి గారితో పాటు ఇతర టెక్నీషియన్స్‌ను కూడా మంచి వారిని ఎంచుకున్నాం. ఇదొక ప్రేమ, యాక్షన్‌, రొమాంటిక్‌తో పాటు మంచి మెసేజ్‌తో కూడిన సినిమా. హీరో సంజయ్‌ రెండు రకాల షేడ్స్‌ను అద్భుతంగా చేశారు. సినిమాలో ఇంకా మంచి స్టఫ్‌ ఉంది. క్లైమాక్స్‌ ఫైట్‌ను ముందుగా 15 లక్షలతో అనుకున్నప్పటికీ, క్వాలిటీ కోసం దాదాపు 75 లక్షల రూపాయలతో జహీరాబాద్‌ షుగర్‌ ఫ్యాక్టరీలో తీశాం.' అని ఆయన అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement