విరాట్‌ కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే | Virat kohli Equals David Warner Most 500 runs seasons in IPL | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే

Apr 28 2024 7:22 PM | Updated on Apr 28 2024 7:22 PM

Virat kohli Equals David Warner Most 500 runs seasons in IPL

ఐపీఎల్‌-2024లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 201 పరుగుల భారీ లక్ష్య చేధనలో కోహ్లి అద్బుతమైన ఇన్నింగ్స్‌ను ఆడాడు. కేవలం 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 

అతడితో పాటు విల్‌ జాక్స్‌ మెరుపు శతకంతో చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 10 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఫలితంగా 201 పరుగుల టార్గెట్‌ను ఆర్సీబీ 16 ఓవర్లలో  ఊదిపడేసింది. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన కోహ్లి పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్‌లో రన్‌ ఛేజింగ్‌లో అత్యధిక సార్లు ఫిప్టీ ప్లస్‌ స్కోర్లు సాధించిన రెండో ఆటగాడిగా కోహ్లి రి​కార్డులకెక్కాడు. ఐపీఎల్‌లో లక్ష్య చేధనలో కోహ్లి ఇప్పటివరకు 24 సార్లు ఏభై పైగా పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా వెటరన్ ఓపెనర్‌, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ 23 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. తాజా మ్యాచ్‌తో ధావన్‌ను కింగ్ కోహ్లి అధిగమించాడు. 

→అదే విధంగా ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సార్లు 500 పైగా పరుగులు చేసిన క్రికెటర్‌గా డేవిడ్ వార్నర్ రికార్డును కోహ్లి సమం చేశాడు. వార్నర్ ఇప్పటివరకు 7 సీజన్లలో 500 పైగా పరుగులు చేయగా.. విరాట్ కూడా సరిగ్గా 500 ప్లస్ పరుగులు చేశాడు. ఐపీఎల్‌-2024లో ఇప్పటివరకు మ్యాచ్‌లు ఆడినహ్లి 500 పరుగులతో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement