breaking news
-
ఏపీకి తుపాను ముప్పు..!
విశాఖ: ఏపీకి తుపాన్ రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అతాలకుతాలమైన ఏపీలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఈనెల 27వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడబోయే తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం.. రేపటికి(శనివారం, అక్టోబర్ 25వ తేదీ నాటికి వాయుగుండంగా బలబడే అవకాశం ఉందని తెలిపిది. ఆపై తుపానుగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఏపీలో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈరోజు(శుక్రవారం), రాయలసీమ, దక్షిణ కోస్తాలో బారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్ల తెలిపింది. దాంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హచ్చరించింది. నిండా ముంచిన వాన.. -
ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు నియామకం
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ సుబేందు సమంత నియామకం జరిగింది. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్.. గుజరాత్ హైకోర్టు నుంచి బదిలీపై రాగా, జస్టిస్ సుబేందు సమంత.. కోల్‌కతా హైకోర్టు నుంచి బదిలీపై వచ్చారు. -
సిరీస్ ఇంగ్లండ్ వశం.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా బ్రూక్
న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో (New Zealand vs England) మరో మ్యాచ్ వర్షార్పణమైంది. ఆక్లాండ్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 23) జరగాల్సిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అంతకుముందు క్రైస్ట్‌చర్చ్‌లో జరగాల్సిన తొలి టీ20 కూడా వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది.మధ్యలో రెండో టీ20లో 65 పరుగుల తేడాతో గెలవడంతో సిరీస్ ఇంగ్లండ్ (England) వశమైంది (1-0). ఆ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన హ్యారీ బ్రూక్‌కు (Harry Brookk) (35 బంతుల్లో 78; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.అక్టోబర్ 26 (మౌంట్ మాంగనూయ్), 29 (హ్యామిల్టన్), నవంబర్ 1 (వెల్లింగ్టన్) తేదీల్లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.3.4 ఓవర్ల పాటు సాగిన ఆటమూడో టీ20 3.4 ఓవర్ల పాటు సాగింది. టాస్ ఓడి ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ వర్షం ప్రారంభమయ్యే సమయానికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. టిమ్ రాబిన్సన్ (2) ఔట్ కాగా.. టిమ్ సీఫర్ట్ (23), రచిన్ రవీంద్ర (10) క్రీజ్‌లో ఉన్నారు.వన్డే సిరీస్‌కు ఇరు జట్లు..ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జో రూట్, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, సామ్ కర్రన్, జేమీ ఓవర్టన్, రెహాన్ అహ్మద్, లియామ్ డాసన్, టామ్ బాంటన్, జేమీ స్మిత్, జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, సోన్నీ బేకర్, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్, లూక్ వుడ్న్యూజిలాండ్: మార్క్ చాప్మన్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, మైఖేల్ బ్రేస్‌వెల్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), జకరీ ఫౌల్క్స్, నాథన్ స్మిత్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, కైల్ జేమీసన్, జేకబ్ డఫీ, మ్యాట్ హెన్రీచదవండి: Virat Kohli: చెరగని మరక.. 17 ఏళ్ల కెరీర్లో తొలిసారి..! -
స్థానికంపై 7న నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణపై వచ్చే నెల 7వ తేదీన తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం.. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై న్యాయ నిపుణుల సలహాల ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం గురువారం రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఘంగా సమావేశమై పలు అంశాలపై చర్చించింది. అనంతరం రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సచివాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నవంబర్ 3న హైకోర్టులో జరగనున్న విచారణలో వెలువడే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. నవంబర్ 7న మళ్లీ మంత్రివర్గ సమావేశం నిర్వహించి రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ తీర్మానించినట్లు వివరించారు. ఎస్ఎల్బీసీలో టీబీఎంకు స్వస్తి శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు సొరంగం తవ్వకాల కోసం ఇప్పటి వరకు అనుసరించిన టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) విధానాన్ని పక్కనబెట్టి, అత్యాధునిక డ్రిల్లింగ్ పరిజ్ఞానంతో మిగతా పనులు పూర్తిచేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. దివాళా పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్న నిర్మాణ సంస్థ జయప్రకాశ్ అసోసియేట్స్‌తో గతంలో చేసుకున్న ఒప్పందాన్నే కొనసాగిస్తూ ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభం నాటికి లేదా 2028 జూన్‌లోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. జలయజ్ఞంలో భాగంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా ఫ్లోరైడ్ బాధిత నల్లగొండ జిల్లాకు 30 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రారంభించిన ఎస్ఎల్బీసీ సొరంగ నిర్మాణం ప్రాజెక్టును గత బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం చేసిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. 44 కి.మీ.ల సొరంగం తవ్వాల్సి ఉండగా, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 31–32 కి.మీల తవ్వకాలు జరిగాయని, ఆ తర్వాత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కారు 2–2.5 కి.మీ.ల మేర మాత్రమే తవ్వకాలు జరిపిందని విమర్శించారు. ప్రపంచంలోనే అతి పొడువైన 44 కిలోమీటర్ల సొరంగంలో రెండు వైపుల నుంచి ఇప్పటివరకు 35 కిలో మీటర్ల సొరంగం తవ్వకం పూర్తయింది. మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగం తవ్వడానికి అటవీ, పర్యావరణ, వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడాలని కేబినెట్ తీర్మానించింది. 1,500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ యూనిట్లు... రాష్ట్రంలో 1,500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ యూనిట్లను ఎక్కడ ఏర్పాటుచేయాలనే అంశంపై విద్యుత్ శాఖ తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. రామగుండంలో 52 ఏళ్ల క్రితం నిర్మించిన 62.5 మెగావాట్ల థర్మల్ బీ–స్టేషన్‌ను తొలగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్తు అవసరాలు, రాబోయే పదేళ్ల విద్యుత్ డిమాండ్ అంచనాలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక తయారు చేయాలని విద్యుత్ శాఖను కేబినెట్ ఆదేశించింది. సౌర, బ్యాటరీ స్టోరేజీ, రివర్స్ పంపింగ్ ద్వారా అందుకు అవసరమైన విద్యుదుత్పత్తికి వ్యూహాలు సిద్ధం చేయాలని కోరింది. ఆ నిబంధన ఎత్తివేత.. ఇద్దరికి మించి సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని ప్రస్తుతం అమ ల్లో ఉన్న నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆ మోదం తెలిపింది. ఇందుకోసం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 21(3)ని తొలగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ ద్వారా చట్టసవరణ కోసం గవర్నర్‌కు ఫైల్ పంపాలని నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఎల్బీనగర్, సనత్‌నగర్, అల్వాల్ టిమ్స్ ఆస్పత్రులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు వెల్లడించారు. -
కొనసాగుతున్న క్రాష్.. బంగారం, వెండి మళ్లీ డౌన్
బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. క్రితం రోజున భారీగా పడిపోయిన పసిడి ధరలు (Today Gold Rate) నేడు కూడా దిగొచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు మోస్తరుగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
‘మేమేం చేయాలో..నువ్వు చెప్పడం ఏంటి?’
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ఏం చేయాలో ట్రంప్ చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు.ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. ‘భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపుతోంది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను శశి థరూర్ ఖండించారు. ట్రంప్ అసత్యమైన, ఆధారాలు లేని వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. భారత్ ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని, అది అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జరుగుతోందని స్పష్టం చేశారు.భారత్ తన జాతీయ ప్రయోజనాల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటుందని, అమెరికా అధ్యక్షుడు భారత్ తరఫున నిర్ణయాలు ప్రకటించడం అనవసరమని థరూర్ అన్నారు. ఇది భారత స్వతంత్రతను, విదేశాంగ విధానాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన విమర్శించారు.విదేశాంగ వ్యవహారాల్లో అనుభవం కలిగిన నేతగా, శశి థరూర్ మాట్లాడుతూ ..భారత్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే దేశం. ఇతర దేశాల నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. కానీ భారత్ తరఫున నిర్ణయాలు ప్రకటించడం అనైతికం’అని అన్నారు. -
సదా సన్నద్ధంగా ఉండాలి
జైసల్మేర్: ఎలాంటి ఉగ్రవాద చర్యనైనా మనం సొంతంగానే తిప్పికొట్టగలమని ఆపరేషన్ సిందూర్ ద్వారా నిరూపించామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మన ప్రత్యర్థులను ఏనాడూ తక్కువ అంచనా వేయొద్దని సైన్యానికి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు ఎదురైనా గట్టిగా ప్రతిఘటించడానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేశారు. శుక్రవారం రాజస్తాన్‌లోని జైసల్మేర్‌లో సైనిక కమాండర్లతో రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. భారత్–చైనా, భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో భద్రతపై సమీక్ష నిర్వహించారు. అలాగే భారత సైనిక దళాల సన్నద్ధతను సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ పలు సూచనలు చేశారు. నేటి ఆధునిక యుగంలో సమాచార యుద్ధరీతిపై దృష్టి పెట్టాలని చెప్పారు. అత్యాధునిక రక్షణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలన్నారు. ఇందుకోసం సైనిక దళాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత సైనిక శక్తికి ఆపరేషన్ సిందూర్ ఒక ప్రతీక అని అభివరి్ణంచారు. మన సైనికుల బలం కేవలం ఆయుధాల్లోనే కాకుండా.. నైతిక క్రమశిక్షణ, వ్యూహాత్మకలో ఉందని పేర్కొన్నారు. ఇది మిలటరీ ఆపరేషన్‌గానే కాకుండా మనదేశ ధైర్యసాహసాలకు, సంయమనానికి గుర్తుగా చరిత్రలో నిలిచిపోతుందని ఉద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని తేలి్చచెప్పారు. సమీక్షా సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. పాక్ సరిహద్దులో ‘థార్ శక్తి’ విన్యాసాలు భారత్–పాకిస్తాన్ సరిహద్దులో జైసల్మేర్ జిల్లాలోని లాంగేవాలా బోర్డర్ పోస్టులో భారత సైన్యం ‘థార్ శక్తి’ శుక్రవారం ప్రత్యేక విన్యాసాలు నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. వందలాది మంది జవాన్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. డ్రోన్లు, రోబో జాగిలాలను, అత్యాధునిక ఆయుధాలను సైతం ప్రదర్శించారు. ఎడారి యుద్ధరీతిలో భారత సైన్యం ధైర్యసాహసాలు, సన్నద్ధతను రాజనాథ్ సింగ్ ప్రశంసించారు. -
వారసులకు ఎంతెంతో ఇప్పుడే చెప్పేయవచ్చు
దేశవ్యాప్తంగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల (బ్యాంకు ఖాతాల్లో ఎవరూ క్లెయిమ్ చేయని నగదు) సమస్య బ్యాంకులకు, ఖాతాదారుల కుటుంబాలకు దీర్ఘకాలంగా సవాలుగా మారింది. ఖాతాదారు చనిపోయిన తర్వాత సరైన నామినేషన్ లేకపోవడం వల్ల వేల కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో పోగవుతున్నాయి. దాంతోపాటు నామినీగా ఉన్న వారికిసైతం సరైన అవగాహన లేకపోవడంతో భారీగా డబ్బు ఖాతాల్లో మూలుగుతుంది. ఈ నేపథ్యంలో అన్క్లెయిమ్డ్ నగదును తగ్గించి, చట్టపరంగా నామినీలకు డబ్బు చేరే ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఒక ఖాతాకు నలుగురు నామినీలను నియమించుకునేలా నిబంధనలు సడలించింది. ఇది నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.ఇప్పటివరకు ఇలా..ఇప్పటివరకు బ్యాంకు పొదుపు ఖాతాకు ఒకే నామినీని మాత్రమే నియమించే అవకాశం ఉండేది. ఈ నిబంధన అనేక సమస్యలకు దారితీసింది. కొందరు ఖాతాదారులైతే అసలు నామినీని యాడ్ చేయాలని కూడా గుర్తించడం లేదు. ఇంకొందరు నామినీని చేర్చినా ఆ విషయం తమ నామినీకి చెప్పడంలేదు. ఖాతాలో పేరున్న ఒక్క నామినీ ప్రమాదవశాత్తు ఖాతాదారుడి కంటే ముందు మరణిస్తే అకౌంట్లోని నగదు మళ్లీ అన్‌క్లెయిమ్డ్‌గానే మిగిలిపోతుంది. ఆ నగదును చట్టబద్ధమైన వారసులు పొందడానికి సుదీర్ఘమైన, ఖర్చుతో కూడిన వ్యవహారం.నలుగురు నామినీలుఈ ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక బ్యాంకు పొదుపు ఖాతాకు గరిష్ఠంగా నలుగురు నామినీలను నియమించుకోవచ్చు. ఈ కొత్త నిబంధన ఖాతాదారులకు రెండు ముఖ్యమైన సౌకర్యాలను కల్పిస్తుంది. ఖాతాదారుడు తన డిపాజిట్లలోని నగదును ప్రతి నామినీకి ఎంత శాతం చొప్పున చెందాలి (ఉదాహరణకు, భార్యకు 50 శాతం, ఇద్దరు పిల్లలకు చెరో 25 శాతం) అని స్పష్టంగా పేర్కొనే వీలుంది.ప్రాధాన్యత క్రమంలో..నామినీలను ప్రాధాన్యత క్రమంలో కూడా నిర్ణయించుకోవచ్చు. అంటే మొదటి నామినీ అందుబాటులో లేకపోతే లేదా మరణిస్తే, డబ్బు రెండో నామినీకి చెందుతుంది. ఈ విధంగా నలుగురిలో ఒకరి తర్వాత మరొకరికి డబ్బు చెందేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నిర్ణయం ద్వారా నామినీని యాడ్ చేయడం మరింత సులభతరం అవుతుంది. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులను నామినీలుగా చేర్చడం వల్ల ఏదైనా అనుకోని సంఘటన సంభవించినా డబ్బు ఖచ్చితంగా వారసులకు చేరుతుంది అనే భరోసా లభిస్తుంది.నామినీ నగదును క్లెయిమ్ చేసుకునే విధానంఖాతాదారు మరణించిన తర్వాత నామినీకి నగదు క్లెయిమ్ చేసుకునే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది.ఖాతాదారుడి మరణం గురించి నామినీ వెంటనే బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదించి వారికి తెలియజేయాలి.బ్యాంకులో అందుబాటులో ఉండే డెత్ క్లెయిమ్ ఫారంను నింపి సమర్పించాలి.ఖాతాదారుడి మరణ ధ్రువపత్రం, మరణాన్ని ధ్రువీకరించిన కాపీ (Attested Copy)ని అందించాలి.నామినీ ఆధార్, పాన్ లేదా ఇతర గుర్తింపు పత్రాలు ఇవ్వాలి.సంబంధిత బ్యాంకు పాస్ బుక్/ డిపాజిట్ రసీదు బ్యాంకులో సమర్పించాలి.నామినీ సమర్పించిన పత్రాలను బ్యాంకు తనిఖీ చేస్తుంది. నామినేషన్ చట్టబద్ధంగా ఉంటే, ఎలాంటి వివాదాలు లేకపోతే, అకౌంట్లో ఉన్న మొత్తాన్ని నామినీకి చెల్లిస్తుంది. ఈ డబ్బును నామినీ ఖాతాకు బదిలీ చేయడం లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లిస్తుంది.ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం.. క్లెయిమ్ ప్రాసెస్ ఎలా? -
ఇలాంటి కేసులు వాదించేముందు ఒకసారి ఆలోచించాలి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలతో భవిష్యత్‌లో ముప్పు వాటిల్లుతుందని, అలాంటి కేసులు వాదించే ముందు న్యాయవాదులు ఒకసారి ఆలోచించాలని హైకోర్టు సూచించింది. అక్రమ నిర్మాణాలు, పార్కింగ్ లేమితో ఇరుగు పొరుగు మధ్య సఖ్యతే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. జీ ప్లస్ 2 నిర్మాణానికి అనుమతి తీసుకుని మరో రెండు అంతస్తులు ఎలా నిర్మిస్తారని అక్రమ నిర్మాణదారును ప్రశ్నించింది. పిటిషనర్, అక్రమ నిర్మాణదారు అన్నదమ్ములని న్యాయవాది చెప్పడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఇద్దరి మధ్య ఆస్తి వివాదాలుంటే ఇలా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించింది. కాలానుగుణంగా విప్లవాలు వస్తుంటాయని, ఇప్పుడు అక్రమ నిర్మాణాల వసూళ్ల విప్లవం సాగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణకు అన్నదమ్ములిద్దరూ హాజరుకావాలని ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పర్వతపురంలో 175 గజాల్లో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదంటూ బి.సంజీవ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భవిష్యత్‌లో పెను ముప్పుగా మారనుందని, ఆ తరాలు ఇప్పటివారిని క్షమించవని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ అధికారులతోపాటు అక్రమ నిర్మాణదారుల తరఫున వాదించే న్యాయవాదులు ఇది తెలుసుకోవాలని సూచించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు వస్తూ పోతూ ఉంటారని, ఇలాంటి కేసులతో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతాయన్నారు. కొందరు భూములను భార్యల పేర కొనుగోలు చేస్తున్నారని, అక్కడ గంజాయి లాంటివి పండిస్తుండటంతో మహిళలు కూడా నిందితుల జాబితాలో చేరుతున్నారన్నారు. -
బ్రేకప్.. గుండెలోతులో బాధ.. : రష్మిక మందన్నా
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఇటీవలే హారర్ కామెడీ థ్రిల్లర్ థామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇకపోతే ఈ మధ్యే తెలుగు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో రష్మిక ఎంగేజ్మెంట్ జరిగింది. దీనికంటే ముందు రష్మికకు లవ్ బ్రేకప్ అనుభవం ఉన్న విషయం తెలిసిందే. గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టి (Rakshit Shetty)తో ప్రేమాయణం సాగించి నిశ్చితార్థం కూడా జరుపుకుంది. పెళ్లి బంధంతో ఒక్కటవుతారనుకుంటే.. బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.మగవారిలా గడ్డం పెంచలేంఇటీవల ఓ భేటీలో రష్మిక.. ప్రేమ, బ్రేకప్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రేమ, బ్రేకప్‌లో విషయంలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా బాధపడతారనే మాటను అంగీకరించనంది. బ్రేకప్ వల్ల మహిళలే ఎక్కువ బాధ, వేదనకు గురవుతున్నారని పేర్కొంది. తమ బాధను వ్యక్తం చేయడానికి మగవారిలా గడ్డం పెంచడం, మద్యం తాగడం వంటివి చేయలేమంది. మనసులోనే బాధను భరిస్తుంటామని, బయటకు వ్యక్తం చేయలేమని తెలిపింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా రష్మిక మందన్నా ఉమెన్ సెంట్రిక్ పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది.చదవండి: ప్రభాస్ బ్రాండ్.. రూ. 7వేల కోట్ల మార్కెట్
