భారత బ్యాడ్మింటన్ స్టార్, మాజీ వరల్డ్ నంబర్ వన్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు
టాలీవుడ్ స్టైలిస్ట్ శ్రావ్య వర్మతో శ్రీకాంత్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది
శ్రావ్య మరెవరో కాదు.. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మేనకోడలు అని సమాచారం
తాజాగా శ్రీకాంత్- శ్రావ్యల వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది
ఈ వేడుకకు మెగా స్టార్ చిరంజీవితో పాటు కింగ్ నాగార్జున తదితరులు హాజరయ్యారు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాంత్ నమ్మాల్వార్ కిదాంబి 1993, ఫిబ్రవరి 7న జన్మించాడు.
2011 కామన్‌వెల్త్ యూత్ గేమ్స్‌లో మెన్స్ డబుల్స్ విభాగంలో కాంస్యం గెలిచిన శ్రీకాంత్.. మిక్స్‌డ్ డబుల్స్‌లో రతజం సాధించాడు
2013లో థాయ్‌లాండ్ ఓపెనర్ గ్రాండ్ పిక్స్ గోల్డ్ టైటిల్‌ను శ్రీకాంత్ తన ఖాతాలో వేసుకున్నాడు
ప్రపంచ నంబర్ వన్ షట్లర్‌గా ఎదిగిన శ్రీకాంత్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ ,అర్జున అవార్డులతో సత్కరించింది


