తెలుగులో పలు సినిమాలు చేస్తున్న ఓ హీరోయిన్.. విరాట్ కోహ్లీకి మరదలు.
అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. ఆమె మరెవరో కాదు రుహానీ శర్మ.
హిమచల్ ప్రదేశ్‌లోని సోలన్ ఊరిలో పుట్టి పెరిగిన రుహానీ ఇప్పుడు హీరోయిన్.
2013లో మ్యూజిక్ వీడియోలతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది.
2017లో 'కడైసి బెంచ్ కార్తీ' అనే తమిళ సినిమాతో హీరోయిన్ అయిపోయింది.
2018లో 'చిలసౌ' మూవీతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ఈ మూవీకి బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో నేషనల్ అవార్డ్ రావడం విశేషం.
ఇందులో రుహానీ శర్మ యాక్టింగ్ చాలా నేచురల్‌గా ఉంటుంది.
తొలి మూవీతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత తప్పటడుగులు వేస్తోంది.
వెంకటేశ్, విశ్వక్ సేన్ లాంటి హీరోలతో చేస్తోంది గానీ సరైన బ్రేక్ రావడం లేదు.
'ఆగ్రా' అనే హిందీ మూవీలో శృంగార సన్నివేశాల్లో నటించి షాకిచ్చింది.
కెరీర్ గురించి పక్కనబెడితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఈమెకు కజిల్ సిస్టర్ అవుతుంది.
అలా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈమెకు బావ అవుతాడు.
గతంలోనే ఈ విషయం బయటకొచ్చింది గానీ ఇప్పుడు ఈమె పుట్టినరోజు సందర్భంగా మరోసారి వైరల్ అవుతోంది.


