
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో ఫన్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మ్యాడ్ స్క్వేర్.

గతంలో విడుదలైన అభిమానులను అలరించిన మ్యాడ్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.












