
చిత్రపరిశ్రమలో రాణించాలంటే హిట్లు తప్పనిసరి.. అలా అయితేనే ఇక్కడ నిలదొక్కుకుంటారు. ముఖ్యంగా ఈ రూల్ హీరోయిన్లకు ఎక్కువగా వర్తిస్తుంది.

ఫ్లాప్ ఇచ్చిన హీరోయిన్స్‌కు మళ్లీ అవకాశాలు రావడం కాస్త కష్టమే.. ఒకట్రెండు హిట్లు కొట్టి ఆ తర్వాత ప్లాపులు రావడంతో చాలామంది హీరోయిన్స్ కనిపించకుండా పోయారు

అయితే, ఆ జాబితాలోకి డింపుల్ హయతి(Dimple Hayathi) కూడా చేరిపోయిందని అందరూ అనుకున్నారు

కానీ, ఈ తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ తలుపుతట్టింది. మళ్లీ తన గ్లామర్‌తో ప్రేక్షకులకు దగ్గర కానుంది

హీరో శర్వానంద్(Sharwanand) కెరీర్‌లో తొలి పాన్ ఇండియా సినిమాకు అంతా సిద్ధమైంది. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా సంపత్‌నంది దర్శకత్వం వహించనున్నారు

కీలకమైన పాత్ర కోసం డింపుల్ హయాతిని దర్శకుడు సంపత్‌నంది ఎంపిక చేశారు

2022, 2023లో (ఖిలాడీ, రామబాణం) వరుసగా ఫ్లాపులిచ్చిన డింపుల్ హయతికి మళ్లీ ఛాన్సులు దక్కలేదు

ఈ గ్యాప్‌లో రోజూ జిమ్‌కు వెళ్లి తన గ్లామర్‌ను కాపాడుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ మరింత స్లిమ్‌గా అయింది

రెగ్యూలర్‌గా తన గ్లామర్ ఫోటోలను సోషల్‌మీడియాలో విడుదల చేస్తూ ఎప్పుడూ ప్రేక్షకులతో టచ్‌లో ఉంటూ వచ్చింది













