యూవీ కొత్త ఇన్నింగ్స్‌.. డ్యాన్స్‌లతో ధూంధాం‌! | Yuvraj Singh Bhangra moves at his sangeet ceremony | Sakshi
Sakshi News home page

యూవీ కొత్త ఇన్నింగ్స్‌.. డ్యాన్స్‌లతో ధూంధాం‌!

Nov 30 2016 2:39 PM | Updated on May 28 2018 2:02 PM

యూవీ కొత్త ఇన్నింగ్స్‌.. డ్యాన్స్‌లతో ధూంధాం‌! - Sakshi

యూవీ కొత్త ఇన్నింగ్స్‌.. డ్యాన్స్‌లతో ధూంధాం‌!

భారత స్ట్రైలిష్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ఆరంభించబోతున్నాడు.

న్యూఢిల్లీ: భారత స్ట్రైలిష్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ఆరంభించబోతున్నాడు. తన ప్రియురాలు, బాలీవుడ్‌ నటి హజెల్‌ కీచ్‌ను ఆయన బుధవారం పెళ్లిచేసుకోబోతున్నాడు. యూవీ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం చండీగఢ్‌లోని లలిత హోటల్‌లో యూవీ సంగీత్‌ వేడుక అట్టహాసంగా జరిగింది. సినీ, క్రికెట్‌ ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకలో యూవీ డ్యాన్స్‌ స్పెషల్‌ హైలెట్‌గా నిలిచింది. సంగీత్‌ వేడుకలో భాంగ్రా స్టెప్పులు వేస్తూ యూవీ అదరగొట్టాడు. జోష్‌తో యూవీ చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

యూవీ పెళ్లి రెండుసార్లు జరగనుంది. బుధవారం చండీగఢ్‌లో సిక్కు సంప్రదాయాల ప్రకారం గురుద్వారలో యూవీ పెళ్లి చేసుకోనుండగా, శుక్రవారం (డిసెంబర్‌ 2న) హిందూ సంప్రదాయాల ప్రకారం గోవాలో వివాహం చేసుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement