నదుల అనుసంధానం పూర్తయితే శ్రీశైలం నీళ్లు కిందకు ఎందుకు? | ysrcp leader GADIKOTA Srikanth Reddy fires o chandrababu govt | Sakshi
Sakshi News home page

నదుల అనుసంధానం పూర్తయితే శ్రీశైలం నీళ్లు కిందకు ఎందుకు?

Sep 19 2015 4:18 AM | Updated on Sep 27 2018 5:46 PM

నదుల అనుసంధానం పూర్తయితే శ్రీశైలం నీళ్లు కిందకు ఎందుకు? - Sakshi

నదుల అనుసంధానం పూర్తయితే శ్రీశైలం నీళ్లు కిందకు ఎందుకు?

గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం పూర్తి చేశామంటున్న ప్రభుత్వం రాయలసీమకు మళ్లించాల్సిన కృష్ణా నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కిందకు ఎందుకు వదిలిపెడుతోందని...

సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం పూర్తి చేశామంటున్న ప్రభుత్వం రాయలసీమకు మళ్లించాల్సిన కృష్ణా నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కిందకు ఎందుకు వదిలిపెడుతోందని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారంనాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పట్టిసీమ ప్రాజెక్టుతో నదుల అనుసంధానం చేయడం ద్వారా కృష్ణా నదీ జలాలను శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంత సాగు, తాగునీటి అవసరాలను తీర్చుతామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులు ఉంటే తప్ప రాయలసీమకు నీటిని మళ్లించడం సాధ్యంకాదనీ, ప్రస్తుతం 839అడుగుల స్థాయిలోనే నీటిని కిందికి వదిలిపెడుతోందన్నారు. పది రోజుల పాటు కిందకు నీటి ని వదలకుండా ఉంటే 854 అడుగుల స్థాయి చేరుకునే అవకాశముందన్నారు.854 అడుగుల నీటిమట్టం ఉంచడం కోసం శ్రీశైలం వద్ద తాము ఆందోళన చేపట్టాల్సి ఉంటుందని శ్రీకాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  
 
నిధుల అనుసంధానమే చేశారు..!
జరగని గోదావరి, కృష్ణా నదుల అనుసంధానాన్ని జరిగినట్టు ప్రభుత్వం ప్రచారం చేస్తోందని శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు.చంద్రబాబు పట్టిసీమ పేరుతో నిధుల అనుసంధానం మాత్రమే చేశారని విమర్శించారు. గోదావరి జలాలు కృష్ణాలో కలపడానికి ఉపయోగపడే పోలవరం కుడి కాల్వను 175కి.మీ. పనులను గతంలోనే పూర్తిచేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆ ఘనత దక్కుతుందా? లేదంటే కేవలం 30కి.మీ. కాలువను తవ్వించిన చంద్రబాబుకు దక్కుతుందా? అని ప్రశ్నించారు.

హంద్రీనీవా ప్రాజెక్టు టెండర్ల విషయంలో సీఎం పేరు చెప్పి సీఈ స్థాయి అధికారులు మిగతా కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనకుండా బెదిరించారని విమర్శించారు. ఇద్దరు మాత్రమేటెండర్లు దాఖలు చేసిన రూ.460కోట్ల విలువ చేసే ఈ పనులలో  రూ.200కోట్ల అవినీతి జరిగిందన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement