నాంపల్లి కోర్టుకు చేరుకున్న వై ఎస్ భారతి | Y S Bharathi reaches nampally court | Sakshi
Sakshi News home page

నాంపల్లి కోర్టుకు చేరుకున్న వై ఎస్ భారతి

Sep 23 2013 4:23 PM | Updated on Sep 1 2017 10:59 PM

నాంపల్లి కోర్టుకు చేరుకున్న వై ఎస్ భారతి

నాంపల్లి కోర్టుకు చేరుకున్న వై ఎస్ భారతి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై మరి కాసేపట్లో తీర్పురానుండటంతో వై.ఎస్. భారతి, వై.ఎస్.వివేకానంద రెడ్డి నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై మరి కాసేపట్లో తీర్పురానుండటంతో వై.ఎస్. భారతి, వై.ఎస్.వివేకానంద రెడ్డి నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. జగన్ బెయిల్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. బెయిల్‌ పిటిషన్‌పై ఈనెల 18న ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం తీర్పు సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

 జగన్ ఆస్తుల కేసులో విచారణ పూర్తయిందని సిబిఐ కోర్టుకు తెలిపింది . హైకోర్టు ఆదేశించిన అన్ని అంశాలపై దర్యాప్తు పూర్తి చేశామని నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన మెమోలో వివరించింది. క్విడ్‌ప్రోకో కేసులో 8 కంపెనీలకు సంబంధించి ఆధారాలు లభించలేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి చిక్కుముడులు వీడుతున్నాయి. పదింట ఎనిమిది కేసుల్లో ఎలాంటి క్విడ్‌ప్రోకో జరగలేదని దర్యాప్తు సంస్థ నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు మెమో రూపంలో వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement