సకల జనభేరిని అడ్డుకుంటే సహించం: రాజేందర్ రెడ్డి


సాక్షి, హైదరాబాద్: సకల జనభేరి సదస్సుకు ఎలాంటి అడ్డం కులు కల్పించినా సహించేది లేదని తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. అడ్వొకేట్స్ జేఏసీ నేతలు ప్రహ్లాదరావు, శ్రీరంగారావుతో కలిసి హైదరాబాద్‌లో ‘సకల జనభేరి’ పోస్టర్‌ను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరాధార, అసత్య ప్రచారంతో హైదరాబాద్‌పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 29న జరిగే సకల జనభేరికి తెలంగాణ న్యాయవాదులంతా కుటుంబ సభ్యులతోపాటు తరలిరావాలని రాజేందర్ పిలుపునిచ్చారు. సకల జనభే రీకి పో లీసులు అనుమతిని ఇచ్చినప్పటికీ, జిల్లాల్లో జరిగే సన్నాహక సమావేశాలకు ఆటంకాలు కల్పిస్తున్నారని విమర్శించారు. ఏవీ కాలేజీ నుంచి నిజాం కాలేజీ దాకా భారీ ర్యాలీని నిర్వహిస్తామని, అందరూ ఉదయమే అక్కడకు చేరుకోవాలన్నారు.  

 

 సకలజన భేరిని జయప్రదం చేయండి

  ఈ నెల 29న జరగనున్న సకలజన భేరి సభను విజయవంతం  చేయాలని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్. విద్యాసాగర్‌లు పిలుపునిచ్చారు.

 

 సకల జనుల భేరీ విజయవంతం చేయండి: ఏపీటీఎఫ్

 ఈ నెల 29న జరిగే సకల జనుల భేరీని విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ తెలంగాణ ప్రిసీడియం ప్రతినిధులు కె.వేణుగోపాల్, కొండల్‌రెడ్డి, మనోహర్ గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.  

 

 తెలంగాణ కోసం 2న ఉపాధ్యాయ గర్జన: పీఆర్‌టీయూ

 తెలంగాణ రాష్ట్రాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 2న ఉపాధ్యాయ గర్జన నిర్వహించనున్నట్లు పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి తెలిపారు. ఇందిరాపార్కు వద్ద ఉదయం 10 గం. నుంచి గర్జన నిర్వహిస్తామన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top