దొంగలను వెంటాడి పట్టుకున్న మహిళ | Woman catches robbers after chase, to be rewarded | Sakshi
Sakshi News home page

దొంగలను వెంటాడి పట్టుకున్న మహిళ

Jul 28 2014 9:33 PM | Updated on Aug 30 2018 5:27 PM

దొంగలను వెంటాడి పట్టుకున్న మహిళ - Sakshi

దొంగలను వెంటాడి పట్టుకున్న మహిళ

దొంగల జోలికి వెళ్లడమంటే నిజంగా సాహసమే. అయితే దొంగలను వెంటాడి పట్టుకుని ధైర్య సాహసాల్లో తామేమీ తక్కువ కాదని మరోసారి నిరూపించింది ఓ మహిళ.

న్యూఢిల్లీ: దొంగల జోలికి వెళ్లడమంటే నిజంగా సాహసమే. అయితే దొంగలను వెంటాడి పట్టుకుని ధైర్య సాహసాల్లో తామేమీ తక్కువ కాదని మరోసారి నిరూపించింది ఓ మహిళ.  శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో నివాసం ఉంటున్న అనిత అనే మహిళ జానకపూరి ప్రాంతంలో అదే రోజు సాయంత్రం ప్రైవేటు బస్సు ఎక్కింది. అప్పటికే బస్సు డోర్ దగ్గర ఉన్న నలుగురు దొంగలు ఆమె వద్ద నున్న పర్సు, చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ను చాకచక్యంగా తస్కరించి బస్సునుంచి అమాంతం దూకేసి పరుగు తీశారు.

 

ఆ సమయంలో ధైర్యాన్ని కోల్పోని ఆ మహిళ బస్సు దిగి వారిని వెంబడించింది. వారి వెంట ఆమె పరుగెడుతూనే రోడ్డుమీద నడిచి వెళ్లే వారిని అప్రమత్తం చేసింది. అంతే ఇద్దరు ఆమె చేతికి చిక్కగా, మరో ఇద్దరు తప్పించుకున్నారు. ఆ దొంగలను స్థానికుల సాయంతో పోలీసులకు అప్పజెప్పింది. దీంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.  ఈ సంఘటనలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఆ మహిళను సన్మానించడానికి నిర్ణయించినట్లు ఒక పోలీస్ అధికారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement