9 ఏళ్ల 9 నెలల పాటు ఏంచేశారు? | Why Congress forgot about Telangana bill for 9 years says Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

9 ఏళ్ల 9 నెలల పాటు ఏంచేశారు?

Feb 21 2014 5:51 PM | Updated on Sep 2 2017 3:57 AM

9 ఏళ్ల 9 నెలల పాటు ఏంచేశారు?

9 ఏళ్ల 9 నెలల పాటు ఏంచేశారు?

తొమ్మిదేళ్ల పాటు తెలంగాణ సమస్యను నాన్చిన కాంగ్రెస్కు ఎన్నికలకు ముందు ఈ విషయం గుర్తొచ్చిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు విమర్శించారు.

న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల పాటు తెలంగాణ సమస్యను నాన్చిన కాంగ్రెస్కు ఎన్నికలకు ముందు ఈ విషయం గుర్తొచ్చిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు విమర్శించారు. 9 ఏళ్ల 9 నెలల పాటు తెలంగాణ బిల్లును కాంగ్రెస్ ఎందుకు మర్చిపోయిందని ఆయన ప్రశ్నించారు. విభజనపై కాంగ్రెస్ వ్యవహరించిన తీరును కేంద్ర మంత్రి చిరంజీవి తప్పుబట్టారని గుర్తు చేశారు. తెలంగాణ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంభించిందని కమల్నాథ్ చెప్పడం విచారకరమన్నారు.

బీజేపీ వల్లే రెండు ప్రాంతాలకు న్యాయం జరిగిందన్నారు. సీమాంధ్రకు ప్యాకేజీకి ఒప్పించామన్నారు. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ సహకరిస్తే ఆ ఘనత సోనియాదని ప్రచారం చేసుకుంటున్నారని వెంకయ్య నాయుడు వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement