breaking news
financial package for Seemandhra
-
9 ఏళ్ల 9 నెలల పాటు ఏంచేశారు?
న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల పాటు తెలంగాణ సమస్యను నాన్చిన కాంగ్రెస్‌కు ఎన్నికలకు ముందు ఈ విషయం గుర్తొచ్చిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు విమర్శించారు. 9 ఏళ్ల 9 నెలల పాటు తెలంగాణ బిల్లును కాంగ్రెస్ ఎందుకు మర్చిపోయిందని ఆయన ప్రశ్నించారు. విభజనపై కాంగ్రెస్ వ్యవహరించిన తీరును కేంద్ర మంత్రి చిరంజీవి తప్పుబట్టారని గుర్తు చేశారు. తెలంగాణ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంభించిందని కమల్‌నాథ్ చెప్పడం విచారకరమన్నారు. బీజేపీ వల్లే రెండు ప్రాంతాలకు న్యాయం జరిగిందన్నారు. సీమాంధ్రకు ప్యాకేజీకి ఒప్పించామన్నారు. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ సహకరిస్తే ఆ ఘనత సోనియాదని ప్రచారం చేసుకుంటున్నారని వెంకయ్య నాయుడు వాపోయారు. -
సీమాంధ్రకు పన్ను మినహాయింపు!
న్యూఢిల్లీ: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదానికి జరుగుతున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. ప్రధాన ప్రతిపక్ష బీజేపీ ప్రతిపాదించిన సవరణలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. సవరణ ప్రతిపాదనలపై కాంగ్రెస్, బీజేపీ ఈ మేరకు అవగాహనకు వచ్చాయి. సీమాంధ్రకు ప్రత్యే ప్రతిపత్తి, ప్యాకేజీ ఇచ్చేందుకు ఒప్పుకుంది. హిమచల్‌ప్రదేశ్ తరహాలో సీమాంధ్రకు పన్ను మినహాయింపు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. బుందేల్‌ఖండ్ తరహాలో ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి ఒప్పుకుంది. రెండు రాష్ట్రాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటించాలన్న బీజేపీ సూచనకు సముఖత వ్యక్తం చేసింది. భద్రాచలం మినహా మిగతా రెవెన్యూ డివిజన్ సీమాంధ్రకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనను అంగీకరించింది. సభాముఖంగా ప్రధాని ప్రకటన చేస్తారని కేంద్రం హామీయివ్వడంతో బిల్లు ఆమోదానికి బీజేపీ అంగీకరించింది.