'పాక్ అనుకూల నినాదాలు చేస్తే సహించం' | we won't tolerate anybody raising pro-Pak slogans on Indian territory: Rajnath Singh | Sakshi
Sakshi News home page

'పాక్ అనుకూల నినాదాలు చేస్తే సహించం'

May 27 2015 1:42 PM | Updated on Sep 3 2017 2:47 AM

'పాక్ అనుకూల నినాదాలు చేస్తే సహించం'

'పాక్ అనుకూల నినాదాలు చేస్తే సహించం'

భారత్ భూభాగంపై ఎవరైనా పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేస్తే సహించబోమని రాజ్ నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు.

న్యూఢిల్లీ: రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి యూపీఏ ప్రభుత్వం ఏళ్లకు ఏళ్లు తాత్సారం చేసిందని, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏడాదిలో 40 రక్షణ ఒప్పందాలు ఖరారు చేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా వ్యవస్థను భ్రష్టు పటిస్తే, ఎన్డీఏ సర్కారు పారదర్శకత పెంచిందని చెప్పారు.

పాకిస్థాన్ తమ సొంత సంక్షేమం కాంక్షిస్తే ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని సూచించారు. కుతంత్రాలకు ముగింపు పలకాలని హితవు పలికారు. ఎవరితోనా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే భారత్ భూభాగంపై ఎవరైనా పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేస్తే సహించబోమని రాజ్ నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement