ఓటుకు కోట్లు కేసులో విచారణ వాయిదా | Vote for note case post poned | Sakshi
Sakshi News home page

ఓటుకు కోట్లు కేసులో విచారణ వాయిదా

Nov 22 2016 2:59 AM | Updated on Sep 4 2017 8:43 PM

ఓటుకు కోట్లు కేసులో అభియోగపత్రం నుంచి జెరూసలేం మత్తయ్య పేరును తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ రెండు వారాలపాటు వాయిదా పడింది.

వారంలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని మత్తయ్యకు సుప్రీం ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ:
ఓటుకు కోట్లు కేసులో అభియోగపత్రం నుంచి జెరూసలేం మత్తయ్య పేరును తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ రెండు వారాలపాటు వాయిదా పడింది. సోమవారం ఈ పిటిషన్‌  సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన సందర్భంగా మరో 4 వారాలు గడువు కావాలని మత్తయ్య తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

ఈ కేసులో మత్తయ్య పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయని, రూ.50 లక్షల నగదును మత్తయ్య చేరేవేసేందుకు ప్రయత్నించారని తెలంగాణ తరపున సీనియర్‌ న్యాయవాది హరీన్‌ రావల్‌ కోర్టుకు తెలిపారు. సుప్రీం కోర్టులో విచారణ ఆలస్యమైతే దాని ప్రభావం హైకోర్టు విచారణపై పడుతుందని విన్నవించారు. వారంలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని మత్తయ్యను కోర్టు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement