ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పై బీజేపీ మండిపడింది.
'ప్రజలను అఖిలేష్ మోసం చేస్తున్నారు'
Oct 16 2014 8:22 PM | Updated on Mar 29 2019 9:24 PM
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పై బీజేపీ మండిపడింది. ఉత్తరప్రదేశ్ లో అభివృద్ది ఏమీ జరగకపోయినా.. ఏదో జరిగినట్లు భూతద్ధంలో చూపించడానికి సమాజ్ వాదీ ప్రభుత్వం యత్నిస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహుదుర్ పటక్ విమర్శించారు.రాష్ట్రంలో ఎటువంటి ఆర్థిక వనరులు లేకుండానే పార్టీ పునాదులను పటిష్టం చేసుకోవడానికి ప్రభుత్వ యత్నించడం సిగ్గు చేటన్నారు. లక్నో లో చేపట్టనున్న మెట్రో ప్రాజెక్టుకు రూ.100 కోట్లపైనే నిధులు అవసరమైనా వాటిని ఇంతవరకూ విడుదల చేయలేదన్న సంగతిని బహుదర్ తప్పుబట్టారు. ఆ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నా ఫోటో షూట్స్ కు, మీడియాకు మాత్రం ఏదో చేస్తున్నట్లు ఫోజులిస్తున్నారన్నారు. అసలు ఆ భారీ ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదని బహుదుర్ ఎద్దేవా చేశారు.
Advertisement
Advertisement