
కొత్త ఏడాది ఆరంభంలోనే రెండు రాష్ట్రాలు!
కొత్త సంవత్సరం ఆరంభంతోనే రాష్ట్ర విభజన జరిగిపోరుు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఖాయమని పార్టీ అధిష్టానవర్గంనుంచి రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి.
వచ్చేనెల 15 నాటికి తెలంగాణ ముసాయిదా బిల్లు సిద్ధం
సాగునీరు, హైదరాబాద్ సమస్యలపై 28న హైకమాండ్ పెద్దల భేటీ
విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని టీ కాంగ్రెస్ నేతలకు దిగ్విజయ్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం ఆరంభంతోనే రాష్ట్ర విభజన జరిగిపోరుు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఖాయమని పార్టీ అధిష్టానవర్గంనుంచి రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ఈ అంశంపై విస్తృత ప్రచారంతో ప్రజల్లోకి వెళ్లాలని ఢిల్లీ పెద్దల నుంచి తెలంగాణ నేతలకు ఆదేశాలు కూడా అందుతున్నారుు. ‘‘తెలంగాణపై నిర్ణయంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తున్నది కాంగ్రెస్ పార్టీ వూత్రమే. పార్టీకి రాజకీయుంగా లబ్ది చేకూరుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయంతో వచ్చే ప్రయోజనాన్ని వురేదో పార్టీ తన్నుకుపోతే లాభమేమిటి? కాంగ్రెస్‌తోనే తెలంగాణ సాధ్యమైందన్న అభిప్రాయం ప్రజల్లో గట్టిగా ఏర్పడాలి. ఎన్నికలు ఎంతోదూరం లేని ఈ తరుణంలో మీరు మౌనం వహించడం సరికాదు. కేవలం కాంగ్రెస్ పార్టీవల్లనే తెలంగాణ సాధ్యమైందనే భావన రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రజల్లో కలగాలి.
ఇందుకోసం మీరంతా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు, విజయోత్సవ సభలు నిర్వహిస్తూ తెలంగాణ ప్రజలతో మమేకంకండి’’ అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ ఇటీవల తెలంగాణ సీనియుర్ నేతలు కొందరికి స్పష్టం చేసినట్లు సమాచారం. నిజావూబాద్ జిల్లా బోధన్‌లో ఇటీవల పార్టీ నిర్వహించిన తొలిసభ అనుకున్న స్థారుులో విజయవంతం కాలేదని, రెండో సభ నుంచి దూకుడు పెంచాలని చెప్పినట్టు తెలుస్తోంది. హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా కరీంనగర్ సభకు అత్యధిక సంఖ్యలో ప్రజలను రప్పించడంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ వల్లే సాకారమవుతోందన్న అంశాన్ని ప్రజలకు గట్టిగా వినిపించాలని నేతలు నిర్ణయించారు. మండలాల స్థాయిలోనూ విజయోత్సవ యాత్రలకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి సభలు ముగించాక ఈ యాత్రలు ముమ్మరంగా ముందుకు తీసుకుపోవాలని అనుకుంటున్నారు.
ఇలా ఉండగా, తెలంగాణ ముసాయిదా బిల్లుపై వచ్చే నెలలోనే రాష్ట్ర శాసనసభ అభిప్రాయూన్ని సేకరించాలని కాంగ్రెస్ కేంద్రపెద్దలు సంకల్పించినట్టు తెలంగాణ నేతలకు సమాచారం అందుతోంది. నవంబర్ నెలాఖరున అసెంబ్లీని సమావేశపరిచి సభ్యుల అభిప్రాయాలు తీసుకోనున్నారు. జాప్యంలేకుండా ముసాయిదా బిల్లు రూపకల్పనకు కేంద్రం కసరత్తు చేస్తోంది. నవంబర్ 15 నాటికే ముసాయిదా బిల్లును పూర్తిచేయించి రాష్ట్రపతికి పంపాలని, దానిపై నవంబర్ నెలాఖరులోగా అసెంబ్లీనుంచి అభిప్రాయ సేకరణను పూర్తి చేయించి, బిల్లును డిసెంబర్‌లో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేలా కసరత్తు సాగుతున్నట్టు తెలంగాణ నేతలకు సమాచారం వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కొత్త ఏడాది ఆరంభానికల్లా రాష్ట్ర విభజన జరిగి, తెలంగాణ ఏర్పాటవుతుందని కేంద్ర పెద్దలు తెలంగాణ నేతలకు భరోసా ఇస్తున్నారు.
అయితే పలు అంశాలకు సంబంధించి సీమాంధ్ర నేతల అభ్యంతరాలపైనా ఒకింత స్పష్టత ఇచ్చేందుకు ఈనెల 28న కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు భేటీ అవుతున్నారని, ఇందులో హైదరాబాద్ అంశం, సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలు తదితర విషయూలపై లోతుగా చర్చిస్తారని తెలుస్తోంది. ఈ అంశాలపై సీమాంధ్ర ప్రజలను ఒప్పించేలా కొన్ని నిర్ణయాలు పార్టీపరంగా వెలువరించి వారిని శాంతపరిచే చర్యలు చేపట్టనున్నారు. విభజన ప్రక్రియుపై నవంబర్ మొదటి వారం నుంచి కేంద్రం పెద్దలు మరింత వేగం పెంచబోతున్నారని తెలంగాణ నేతలు పేర్కొంటున్నారు.