దక్షిణాఫ్రికాతో 50 బిలియన్ డాలర్లకు వాణిజ్యం...
వచ్చే ఏడేళ్లలో భారత్‌తో తమ దేశ వాణిజ్యం 50 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని దక్షిణాఫ్రికా తెలిపింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్యం 15 బిలియన్ డాలర్లుందని భారత్‌లో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఏడేళ్లలో భారత్‌తో తమ దేశ వాణిజ్యం 50 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని దక్షిణాఫ్రికా తెలిపింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్యం 15 బిలియన్ డాలర్లుందని భారత్‌లో దక్షిణాఫ్రికా యాక్టింగ్ హై కమిషనర్ మలోస్ మొగాలే మంగళవారమిక్కడ ఫ్యాప్సీ సదస్సులో తెలిపారు. భారత్‌తో ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ (పీటీఏ) విషయమై సౌత్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్‌తో(ఎస్‌ఏసీయూ) చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కస్టమ్స్ యూనియన్‌లో దక్షిణాఫ్రికాతోపాటు బోట్స్‌వానా, లెసోతో, నమీబియా, స్వాజిలాండ్‌లు సభ్యదేశాలు. పీటీఏకు సంబంధించి కొన్ని అంశాలు పరిష్కారం కావాల్సి ఉందని మొగాలే అన్నారు. ఒప్పందం కార్యరూపం దాలిస్తే సభ్య దేశాలకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. మైనింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన ఇక్కడి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రూపాయి పతనాన్ని కట్టడి చే యడంలో భాగంగా బంగారం దిగుమతుల విషయంలో భారత్ తీసుకుంటున్న చర్యలు తమ దేశ పసిడి ఎగుమతులపై ప్రభావం చూపిస్తుందని అన్నారు.