పులి... చిన్నారిని చంపేసింది | Tiger kills five-year-old in Bihar national park | Sakshi
Sakshi News home page

పులి... చిన్నారిని చంపేసింది

May 23 2015 8:42 AM | Updated on Sep 3 2017 2:34 AM

పులి... చిన్నారిని చంపేసింది

పులి... చిన్నారిని చంపేసింది

ఐదేళ్ల చిన్నారిపై పులి దాడి చేసి చంపేసింది.

పాట్నా: ఐదేళ్ల చిన్నారిపై పులి దాడి చేసి చంపేసింది. ఈ సంఘటన బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో బెరిహండీ గ్రామ సమీపంలో వాల్మీకి నేషనల్ పార్క్లో శుక్రవారం చోటు చేసుకుందని ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. నేషనల్ పార్క్ సమీపంలోని గ్రామ పరిధిలో చిన్నారి బబ్లూ ఆటలాడుకుంటున్నాడు. ఆ క్రమంలో బబ్లూపై పులి ఆకస్మాత్తుగా దాడి చేసి చంపేసింది. అనంతరం అతడి శరీరాన్ని చిన్నచిన్న ముక్కలుగా చిన్నాభిన్నం చేసింది.

దాంతో గ్రామస్తులు, పార మిలటరీ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే వాల్మీకి నేషనల్ పార్క్లో పులుల సంఖ్య గత మూడేళ్ల కాలవ్యవధిలో రెండింతలు అయ్యాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పార్క్ పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు. ప్రభుత్వ విధానం ప్రకారం మృతి చెందిన బబ్లూ కుటుంబానికి రూ. 2 లక్షలు నష్ట పరిహారం అందజేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement