ప్రధాని మోదీని కలిసిన క్రికెటర్‌! | Suresh Raina meets PM Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీని కలిసిన క్రికెటర్‌!

Jun 28 2017 1:00 PM | Updated on Aug 15 2018 2:32 PM

ప్రధాని మోదీని కలిసిన క్రికెటర్‌! - Sakshi

ప్రధాని మోదీని కలిసిన క్రికెటర్‌!

నెదర్లాండ్స్‌ ఆమ్‌స్టర్‌డమ్‌ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని భారత క్రికెటర్‌ కలిశారు.

నెదర్లాండ్స్‌ ఆమ్‌స్టర్‌డమ్‌ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని భారత క్రికెటర్‌ సురేశ్‌ రైనా కలిశారు. ఈ సందర్భంగా భార్య ప్రియాంకతో కలిసి ప్రధాని మోదీతో రైనా ఫొటో దిగారు. ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన రైనా.. మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. గోల్డన్‌ విజన్‌ ఉన్న వ్యక్తి మోదీ అని, ఆయన నెదర్లాండ్స్‌ పర్యటన నిర్మాణాత్మకమని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా మొదట పోర్చుగల్‌, అమెరికాలో పర్యటించి అనంతరం నెదర్లాండ్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. చివరిసారిగా టీమిండియా తరఫున గత ఫిబ్రవరిలో ట్వంటీ-20ల్లో ఆడిన సురేశ్‌ రైనా ప్రస్తుతం భార్య ప్రియాంకతో కలిసి యూరప్‌లో విహరిస్తున్నారు. ఆయన నెదర్లాండ్స్‌లో ఉన్న సమయంలోనే ప్రధాని మోదీ అక్కడికి రావడంతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఒకవైపు యూరప్‌లో విహరిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా ఫిట్‌నెస్‌ కాపాడుకుంటున్నారు రైనా.. అక్కడ కూడా ఫిట్‌నెస్‌ కోసం చేస్తున్న కసరత్తుల వీడియోలను అభిమానులతో ట్విట్టర్‌లో షేర్‌ చేసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement