అయోధ్య వివాదంలోకి బీజేపీని లాగిన శివసేన | Shiv Sena chief Uddhav Thackeray mocks BJP on Ayodhya issue | Sakshi
Sakshi News home page

అయోధ్య వివాదంలోకి బీజేపీని లాగిన శివసేన

Oct 22 2015 8:30 PM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీపై మరోసారి శివసేన పార్టీ మాటల దాడికి దిగింది. ఇటీవల ప్రతి విషయంలో జోక్యం చేసుకొని బీజేపీని విమర్శిస్తున్న శివసేన అయోధ్య విషయంలో బీజేపీని లాగుతూ నిందించింది.

ముంబయి: బీజేపీపై మరోసారి శివసేన పార్టీ మాటల దాడికి దిగింది. ఇటీవల ప్రతి విషయంలో జోక్యం చేసుకొని బీజేపీని విమర్శిస్తున్న శివసేన అయోధ్య విషయంలో బీజేపీని లాగుతూ నిందించింది.

ఎప్పుడు నిర్మిస్తారనే విషయం స్పష్టం చేయకుండా అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని చాలాకాలంగా బీజేపీ చెప్పుకుంటూ వస్తుందని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. పలు అంశాల్లో బీజేపీని విభేదిస్తున్న ఆ పార్టీ మహారాష్ట్రలో ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు ఉద్దవ్ వ్యాఖ్యలతో స్పష్టమైంది. మహారాష్ట్రల బీజేపీ ఇంకా ఎన్నాళ్లు అధికారంలో ఉంటుందో తమకు తెలుసని ఆయన అన్నారు. దేశ ప్రతిష్ట మసకబారేది సుదీంద్ర కులకర్ణిపై ఇంక్ చల్లడం వల్ల కాదని, దాద్రీ వంటి ఘటనల వల్లే తగ్గుతుందని కూడా ఆయన బీజేపీని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement