ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ గురువారం బీజేపీలో చేరారు.
న్యూఢిల్లీ: ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ గురువారం బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ కండువా వేసి సాదర స్వాగతం పలికారు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశముంది.
అయితే తన బాధ్యతలేమిటో బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని రామ్ మాధవ్ చెప్పారు. పార్టీ అభివృద్ధి కోసం పాటు పడతానని అన్నారు. రాబోయే 4 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఆయన దీమా వ్యక్తం చేశారు.