లైంగిక నేరాల ఆరోపణలు.. యువరాజు అరెస్టు! | Saudi prince facing sex crime charge in Los Angeles | Sakshi
Sakshi News home page

లైంగిక నేరాల ఆరోపణలు.. యువరాజు అరెస్టు!

Sep 26 2015 9:18 AM | Updated on Aug 20 2018 7:34 PM

లైంగిక నేరాల ఆరోపణలు.. యువరాజు అరెస్టు! - Sakshi

లైంగిక నేరాల ఆరోపణలు.. యువరాజు అరెస్టు!

సౌదీ యువరాజు ఓ మహిళను లైంగికంగా వేధించిన నేరానికి అతడిని అమెరికాలోని లాస్ ఏంజెలిస్లో అరెస్టు చేశారు.

సౌదీ యువరాజు ఓ మహిళను లైంగికంగా వేధించిన నేరానికి అతడిని అమెరికాలోని లాస్ ఏంజెలిస్లో అరెస్టు చేశారు. యువరాజు మజీద్ అబ్దులజీజ్ అల్ సౌద్ను అరెస్టు చేసిన విషయాన్ని లాస్ ఏంజెలిస్ పోలీసుశాఖకు చెందిన డ్రేక్ మాడిసన్ నిర్ధారించారు. ఒక మహిళను లైంగికంగా వేధించినందుకు 28 ఏళ్ల యువరాజును అరెస్టు చేశారు. ఒక రోజు రాత్రంతా యువరాజు జైల్లోనే గడిపాడు.

ఆ తర్వాత దాదాపు 2 కోట్ల రూపాయల పూచీకత్తు సమర్పించిన తర్వాత వదిలిపెట్టారు. యురాజు ఉన్న బెవర్లీ హిల్స్ భవనం గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించి తీవ్రంగా రక్తస్రావం అయిన ఓ మహిళ.. తనను రక్షించాలంటూ అరుస్తుండటంతో తాము అటు వెళ్లి చూసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. యువరాజు అక్టోబర్ 19న కోర్టులో హాజరుకావాల్సి ఉంది. ఒకవేళ నేరం రుజువైతే 8 ఏళ్ల జైలుశిక్షతో పాటు, 6.61 లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, సౌదీ యువరాజు అరెస్టుతో.. మరింత మంది మహిళలు అతడి చేతుల్లో తాము బలయ్యామంటూ పోలీసుల ముందుకు వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement