శాంసంగ్ ఎస్ 8 స్మార్ట్ ఫోన్ లీక్..ధర ఎంత? | SamsungGalaxy S8 photo and release date leaked | Sakshi
Sakshi News home page

శాంసంగ్ ఎస్ 8 స్మార్ట్ ఫోన్ లీక్..ధర ఎంత?

Jan 27 2017 2:27 PM | Updated on Sep 5 2017 2:16 AM

శాంసంగ్ ఎస్ 8 స్మార్ట్ ఫోన్ లీక్..ధర ఎంత?

శాంసంగ్ ఎస్ 8 స్మార్ట్ ఫోన్ లీక్..ధర ఎంత?

ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న శాంసంగ్ గెలాక్స్ ఎస్ 8 కు సంబంధించిన వివరాలు నెట్ లో చక్కర్లుకొడుతున్నాయి.

న్యూఢిల్లీ:  కొరియా మొబైల్  మేకర్  తరువాత స్మార్ట్  ఫోన్ వివరాలు లీకయ్యాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న  శాంసంగ్  గెలాక్స్ ఎస్ 8 కు సంబంధించిన వివరాలు నెట్ లో చక్కర్లుకొడుతున్నాయి.  ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ ఫోటో, ఫీచర్లు , ధర, లాంచింగ్ తేదీ తదితర వివరాలు  బహిర్గతమయ్యాయి.  శాంసంగ్ గెలాక్సీ  ఎస్ 8  రెండు  మోడల్స్ లో  మార్చి 29 న   న్యూయార్క్ లో లాంచ్  కానుందని ఇవాన్ బ్లాస్  నివేదించింది.  

శాంసంగ్ గెలాక్సీ  ఎస్ 8  స్పెసిఫికేషన్స్
5.8 అంగుళాల, 6.2 అంగుళాల డిస్  ప్లేతో రెండు  వేరియంట్లు
835  స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్
12 ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా  విత్ f / 1.7
4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
256 విస్తరణ సామర్థ్యం
 3000, 3500 ఎంఏ హెచ్ బ్యాటరీ సామర్థ్యం తో రెండు వేరియంట్లు అయితే హోం బటన్ మిస్ అయిందట.

11 రెట్ల  వేగంగా 23 శాతం గ్రాఫిక్స్, 20 శాతం బ్యాటరీ సామర్థ్యంతో రాబోతోందని రిపోర్ట్ చేసింది. అలాగే  న్యూయార్క్ లో మార్చి 29న లాంచ్ కానుండగా  ఏప్రిల్ 21 విక్రయాలు మొదలు కానున్నాయని ఇవాన్ బ్లాస్  పేర్కొంది.   వీటి ధరలు సుమారు రూ.58,000 (5.8 ఇంచెస్ ) రూ.65,400 (6.2 ఇంచెస్) గా ఉండనున్నాయని  తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement