
వయసు 37.. బరువు 18 కిలోలు
ఒకపుడు ఆమె అందాల బొమ్మ. తనకు నచ్చిన, తనను మెచ్చిన వరుణ్ని పెళ్లి చేసుకుంది. అందరి ఆడపిల్లల్లాగానే తను కూడా రాబోయే జీవితం గురించి అనేక కలలు కంది. కానీ ఇపుడు ఎముకల గూడుగా మారిపోయింది. ముట్టుకుంటేనే ఎముకలు విరిగిపోయేంత అల్పంగా మారిపోయింది.
ఒకపుడు ఆమె అందాల బొమ్మ. తనకు నచ్చిన, తనను మెచ్చిన వరుణ్ని పెళ్లి చేసుకుంది. అందరు ఆడపిల్లల్లాగానే తను కూడా రాబోయే జీవితం గురించి అనేక కలలు కంది. కానీ ఇపుడు ఎముకల గూడుగా మారిపోయింది. ముట్టుకుంటేనే ఎముకలు విరిగిపోయేంత అల్పంగా మారిపోయింది. ఇందుకు కారణం ఏంటో తెలుసా.. ఎనోరెక్సియా నెర్వోసా.. మరోలా చెప్పాలంటే ఈటింగ్ డిజార్డర్. తింటే ఎక్కడ లావు అయిపోతామో అన్న భయంతోను, సన్నగా నాజూగ్గా కనపడాలనే తాపత్రయంతో పొట్టమాడ్చుకోవడం వల్లే ఈ వ్యాధి వస్తుందట. అలా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన భార్యను బతికించుకోవడానికి ఆమె భర్త చేసిన ప్రయత్నం వారి జీవితాల్లో కొంత్త ఆశలు నింపింది.
లావు అయిపోతున్నామనే భయంతో ఎడా పెడా డైటింగ్ చేస్ వాళ్లకి వచ్చే జబ్బు ఎనోరెక్సియా. ఈ వ్యాధి బారిన పడిన వాళ్లు ఎంత సన్నగా ఉన్నా ఇంకా లావుగా ఉన్నామేమోననే భయంతో ఆహారాన్ని విపరీతంగా కట్టడి చేస్తారని నిపుణులు అంటున్నారు
37 ఏళ్ల రాచెల్ ఫరూఖ్ ఈ జబ్బు బారిన పడి ఎముకల గూడులా మారిపోయింది. ఇప్పుడామె కేవలం 18 కిలోల బరువు మాత్రమే ఉంది. ఫలితంగా శరీరంలోని అవయవాలన్నీ దెబ్బతిన్నాయి. పలుమార్లు రక్తం ఎక్కించుకున్నా ఫలితం లేదు. పరిస్థితి మరింత దిగజారింది. ఎలాగైనా తన భార్యను బతికించుకోవాలనుకున్న రాచెల్ భర్త రాడ్ ఒక ప్రయత్నం చేశాడు. ఇది ఆ దంపతుల జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చింది.
రాచెల్ భర్త ఆమె దీన పరిస్థితిని వివరిస్తూ సహాయం చేయాల్సింది కోరుతూ ఒక వీడియోను goFundMe.com అనే వెబ్సైట్లో పో్స్ట్ చేశాడు. పదేళ్ల నుంచి తన భార్య మృత్యువుతో పోరాడుతోందని, మెరుగైన చికిత్స చేయించకపోతే ఆమె చనిపోవడం ఖాయమంటూ చికిత్సకోసం దాదాపు 64 లక్షల ఆర్థిక సహాయాన్ని అర్థించాడు. దీనికి దాతలు స్పందించి అందించిన విరాళం ఎంతో తెలుసా.. అక్షరాలా కోటి 28 లక్షల రూపాయలు. ఇంకా అందుతూనే ఉన్నాయట. దీంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరైన ఆ దంపతులు, దాతలకు ధన్యవాదాలు తెలుపుతూ బుధవారం మరో వీడియోను పోస్ట్ చేశారు.