పెళ్లొద్దా బాబూ.. 75పైసలు ఫైన్ చెల్లించు | Panchayat fines groom 75 paisa for cancelling engagement | Sakshi
Sakshi News home page

పెళ్లొద్దా బాబూ.. 75పైసలు ఫైన్ చెల్లించు

Apr 15 2015 9:45 AM | Updated on Oct 2 2018 4:31 PM

పెళ్లొద్దా బాబూ.. 75పైసలు ఫైన్ చెల్లించు - Sakshi

పెళ్లొద్దా బాబూ.. 75పైసలు ఫైన్ చెల్లించు

వివాదాస్పద తీర్పులిస్తూ నిత్యం వార్తల్లో నిలిచే హర్యానాలోని ఖాప్ పంచాయతీ ఈసారి ఓ విచిత్రమైన తీర్పునిచ్చి ఆశ్చర్యాన్ని గొలిపింది.

హర్యానా: వివాదాస్పద తీర్పులిస్తూ నిత్యం వార్తల్లో నిలిచే హర్యానాలోని ఖాప్ పంచాయతీ ఈసారి ఓ విచిత్రమైన తీర్పునిచ్చి ఆశ్చర్యాన్ని గొలిపింది. ఓ పక్క అమ్మాయి తరుపువాళ్లు పెళ్లి పనుల్లో తలమునకలై ఉండగా తనకు పెళ్లే వద్దని అంతకుముందు చేసుకున్న నిశ్చితార్థం రద్దుచేసుకుంటున్నాని ప్రకటించిన ఓ పెళ్లికొడుకుకు కేవలం 75 పైసల ఫైన్ వేసింది. ఈ తీర్పుతో ఇక ఇరుపక్షాలు సర్దుకోవాలని తీర్పు చెప్పింది. దీంతో ఖాప్ పంచాయతీల నిర్ణయానికి తిరుగు చెప్పలేని అమ్మాయి కుటుంబం కూడా మిన్నకుండా ఉండిపోయింది.

ఫతేబాద్ జిల్లాలోని మాన్సి అనే అమ్మాయికి పంజాబ్కు చెందిన సంజీవ్ కుమార్ అనే వ్యక్తితో నిశ్చితార్థం అయింది. ఏప్రిల్ 22న పెళ్లి చేయాలని ముహూర్తం పెట్టుకున్నారు. అయితే, పెళ్లికి ముందే కారు, ఇతర విలువైన వస్తువులు తమకు కట్నంగా ఇవ్వాలని కోరడంతో అమ్మాయి తరఫువాళ్లు ఒప్పుకోలేదు. ఈ విషయం తొలుత పోలీసుల వద్దకు వెళ్లగా అనతరం ఖాప్ పంచాయతీ చేరింది. అక్కడి పెద్దలు ఓ గోశాల వద్ద విచారణ చేపట్టి అమ్మాయికి 75 పైసలు ఫైన్ చెల్లించాలని తీర్పిచ్చారు. అయితే, ఈ తీర్పుతో అమ్మాయి అసంతృప్తికి లోనై తిరిగి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement