ప్యానాసోనిక్...బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ | Panasonic T31 budget Android 4.2 smartphone launched for Rs. 7990 | Sakshi
Sakshi News home page

ప్యానాసోనిక్...బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

Oct 17 2013 2:14 AM | Updated on Nov 6 2018 5:26 PM

ప్యానాసోనిక్...బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ - Sakshi

ప్యానాసోనిక్...బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

ప్యానాసోనిక్ కంపెనీ ఆండ్రాయిడ్ ఆధారిత కొత్త స్మార్ట్‌ఫోన్, ప్యానాసోనిక్ టీ31ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది.

న్యూఢిల్లీ: ప్యానాసోనిక్ కంపెనీ ఆండ్రాయిడ్ ఆధారిత కొత్త స్మార్ట్‌ఫోన్, ప్యానాసోనిక్ టీ31ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.7,990గా నిర్ణయించామని పేర్కొంది. భారత మార్కెట్లోకి ప్యానాసోనిక్ కంపెనీ అందిస్తున్న ఐదో మోడల్ ఇది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ డ్యుయల్ సిమ్ ఫోన్‌లో 4-అంగుళాల డబ్యూవీజీఏ డిస్‌ప్లే, డ్యుయల్ కోర్ ప్రాసెసర్,  3.2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇన్‌బుల్ట్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ వంటి ప్రత్యేకతలున్నాయి. భవిష్యత్తులో కూడా విస్తృతమైన స్థాయిలో ఫోన్ల ను అందించనున్నామని ప్యానాసోనిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ పేర్కొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement