'మద్దతు కావాలంటే మా ఇంటికి రండి' | not received any proposal from BJP for Shiv Sena, says Uddhav Thackera | Sakshi
Sakshi News home page

'మద్దతు కావాలంటే మా ఇంటికి రండి'

Oct 19 2014 7:02 PM | Updated on Mar 29 2019 9:24 PM

'మద్దతు కావాలంటే మా ఇంటికి రండి' - Sakshi

'మద్దతు కావాలంటే మా ఇంటికి రండి'

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ నుంచి తమకు ఎటువంటి ప్రతిపాదన రాలేదని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. తన నివాసంలో ప్రశాంతంగా కూర్చుని ఉన్నానని, తమ మద్దతు కావాలనుకునే వారెవరైనా తనను సంప్రదించవచ్చని చమత్కారంగా చెప్పారు. తన నివాసం 'మాతృశ్రీ'లో ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఒకవేళ తాను బీజేపీని సంప్రదిస్తే ఎన్సీపీ మద్దతు తీసుకున్నామన్న సమాధానం రావొచ్చెమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మద్దతు ఇస్తారా అని విలేకరుల ప్రశ్నించగా... మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదని పరోక్షంగా ఆయన సమాధానమిచ్చారు. ప్రజాతీర్పును శిరసావహిస్తున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement