ప్రీమియం రేట్ల పెంపునకు కంపెనీలు సిద్ధం | Non-life premia set to go up as regulator backs move | Sakshi
Sakshi News home page

ప్రీమియం రేట్ల పెంపునకు కంపెనీలు సిద్ధం

Mar 13 2017 12:44 PM | Updated on Sep 5 2017 5:59 AM

ప్రీమియం రేట్ల పెంపునకు కంపెనీలు సిద్ధం

ప్రీమియం రేట్ల పెంపునకు కంపెనీలు సిద్ధం

పెద్ద పెద్ద క్లయిమ్స్ సెటిల్ మెంట్, వడ్డీరేట్లు పడిపోవడం ఇన్సూరెన్స్ కంపెనీలకు భారంగా మారిపోయింది. దీంతో ప్రీమియం రేట్లను పెంచాలని నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు భావిస్తున్నాయి..

ముంబై : పెద్ద పెద్ద క్లయిమ్స్ సెటిల్ మెంట్, వడ్డీరేట్లు పడిపోవడం ఇన్సూరెన్స్ కంపెనీలకు భారంగా మారిపోయింది. దీంతో ప్రీమియం రేట్లను పెంచాలని నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు భావిస్తున్నాయి.. 10 నుంచి 15 శాతం మేర ప్రీమియం రేట్లను పెంచి, కొంత భారాన్ని తగ్గించుకోవాలని కంపెనీలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ కూడా ప్రీమియం రేట్ల పెంపుకు కంపెనీలకు మద్దతిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఐఆర్డీఏఐ మోటార్ ప్రీమియంను, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను పెంచుతున్నట్టు తెలిపింది. వీటిని ఏప్రిల్ 1 నుంచి ఐఆర్డీఏఐ అమలు చేయబోతోంది.  ఫార్మా, పవర్, సిమెంట్ వంటి 10 సెగ్మెంట్లలో ప్రస్తుతం ప్రీమియం రేట్లు జీరోగా ఉన్నాయి. వాటిని పెంచాలని కంపెనీలు ప్లాన్స్ వేస్తున్నాయి.
 
వచ్చే ఏడాది నుంచి ఈ సెగ్మెంట్లలో ప్రీమియం రేట్లు 10-15 శాతం రేంజ్ లో పెరుగనున్నాయి.  ఇన్సూరెన్స్ మార్కెట్లో చాలా పోటీగా ఉంటుందని, ప్రీమియంను పెంచడంపై చాలా తక్కువ అవకాశముంటుందని నేషనల్ ఇన్సూరెన్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సనత్ కుమార్ అన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ గ్రూప్ లో కూడా సమీక్షించిన ధరలను చూస్తామని ఆయన తెలిపారు. నాన్-లైఫ్‌ ఇన్సూరర్ గా పేరున్న న్యూ ఇండియా కొన్నిరంగాల్లో ప్రీమియంలను పెంచేందుకు సిద్ధమైంది. ఫైర్, గ్రూప్ హెల్త్ లో కొత్త ఏడాది నుంచి ప్రీమియం రేట్ల పెంపును చూస్తారని న్యూ ఇండియా అస్యూరెన్స్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ జి.శ్రీనివాసన్ కూడా తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement