తమిళ నేతకు మిత్రుడైన మోడీ | Narendra Modi is hardworking and a good friend, says Karunanidhi | Sakshi
Sakshi News home page

తమిళ నేతకు మిత్రుడైన మోడీ

Feb 28 2014 12:37 PM | Updated on Mar 18 2019 9:02 PM

తమిళ నేతకు మిత్రుడైన మోడీ - Sakshi

తమిళ నేతకు మిత్రుడైన మోడీ

సార్వత్రిక ఎన్నికల వేళ చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు శత్రువుగా కనిపించిన వ్యక్తే నేడు మిత్రుడుగా మారిపోతున్నాడు.

చెన్నై : సార్వత్రిక ఎన్నికల వేళ చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు శత్రువుగా కనిపించిన వ్యక్తే నేడు మిత్రుడుగా మారిపోతున్నాడు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కూడా ఇలాగే ఓ తమిళ నేతకు మిత్రుడిగా మారిపోయారు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి... నరేంద్ర మోడీపై అనూహ్య రీతిలో ప్రశంసలు కురిపించారు.

మోడీ కష్టజీవి అని కితాబిచ్చిన కరుణ... మోడీ తనకు మంచి మిత్రుడంటూ కొనియాడారు. తమిళనాట అధికార అన్నాడీఎంకే మెజారిటీ ఎంపీ సీట్లు కొల్లగొట్టనుందనే వార్తల నడుమ కరుణానిధి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్‌కు ఇప్పటికే కటీఫ్ చెప్పిన డీఎంకే ఎన్డీఏలోకి చేరే అవకాశాలూ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపే ఎన్డీఏ మరింత బలోపేతం కావడం తథ్యమని విశ్లేషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement