చెన్నై, సాక్షి ప్రతినిధి: కూటమి ఖరారు కావడంతో కాంగ్రెస్, డీఎంకేలు సీట్ల పంపకాలకు సిద్ధమయ్యాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలనేదానిపై డీఎంకే సమాలోచనలు సాగిస్తుండగా, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం కోసం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఢిల్లీ విమానం ఎక్కారు. డీఎండీకే కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన డీఎండీకే, కాంగ్రెస్‌లను విజయకాంత్ ఖంగుతినిపించడంతో రెండు పార్టీల్లోనూ ఎన్నికల పనులు వేగం పుంజుకున్నాయి. డీఎండీకేను డీఎంకే కూటమిలోకి తెచ్చే బాధ్యత మీదేనంటూ కాంగ్రెస్‌పై కరుణానిధి భారం మోపారు.
డీఎండీకే కోసం తమ సీట్లు త్యాగం చేసేందుకు కూడా సిద్ధమని కాంగ్రెస్ ప్రకటించింది. డీఎండీకే తమతో కలవడం ఖాయమని కాంగ్రెస్, డీఎంకేలు గట్టిగా నమ్మాయి. అందుకే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా సీట్ల సర్దుబాట్లను వాయిదావేసుకుంటూ వచ్చాయి. డీఎంకే, డీఎండీకే, కాంగ్రెస్‌లకు తలా ఇన్ని సీట్లు అంటూ నిర్ణయాలు జరిగినట్లు పుకార్లు షికారు చేశాయి.
పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుపెట్టుకుని నష్టపోయిన విజయకాంత్‌కు డీఎంకేనే ప్రత్యామ్నాయమని ధీమాతో కొనసాగాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజయకాంత్ ఒంటరిబాట పట్టారు. చేసేదిలేక కాంగ్రెస్, డీఎంకేలు సీట్ల పంపకాల పనిలోకి నిమగ్నమయ్యాయి. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ మాత్రమే ప్రధాన పార్టీ కావడంతో సీట్ల సర్దుబాట్లు సులభంగా సాగుతుందని ఆశిస్తున్నారు.
బృందం రెడీ
గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల నుంచి పోటీకి దిగింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నుంచి కాంగ్రెస్ 50 సీట్లను ఆశిస్తోంది. పంపకాల్లో కనీసం 45 సీట్లయినా దక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. సీట్ల పంపకాలపై ఒక బృందాన్ని సిద్ధం చేసుకుంది. ఆశిస్తున్న సీట్ల సంఖ్యపై అధిష్ఠానం ఆమోద ముద్ర కోసం ఈవీకేఎస్ ఇళంగోవన్ అకస్మాత్తుగా శుక్రవారం ఢిల్లీకి పయనమయ్యారు. అయితే ఈసారి కాంగ్రెస్ కోరినన్ని సీట్లు దక్కక పోవచ్చని తెలుస్తోంది. అలాగే ఇళంగోవన్ ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రత్యేకవాహనాన్ని సిద్ధం చేసుకున్నారు.
కూటమి కుదిరింది.. పంపకాలకు తెరలేచింది!
Published Sat, Mar 12 2016 3:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
మీ ఇంటి ఆడబిడ్డను ఆశీర్వదించండి
కాంగ్రెస్ మాయమాటలకు మోసపోవద్దు
ఆదరించండి.. అభివృద్ధి చేస్తా
ప్రాణం తీసిన మామిడి కాయల గొడవ
బీజేపీ అనుకూల పార్టీలను ఓడించాలి
ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి..
ఉరేసుకొని వ్యక్తి మృతి
ఆర్ఎస్పీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
మెరుగైన వైద్యసేవలు అందించాలి
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement