ఈసారి ఆ ఎంపీ పోలీసులతో పెట్టుకున్నారు! | MP Ravindra Gaikwad arguing with Maharashtra cops | Sakshi
Sakshi News home page

ఈసారి ఆ ఎంపీ పోలీసులతో పెట్టుకున్నారు!

Apr 20 2017 12:43 PM | Updated on Sep 5 2017 9:16 AM

ఈసారి ఆ ఎంపీ పోలీసులతో పెట్టుకున్నారు!

ఈసారి ఆ ఎంపీ పోలీసులతో పెట్టుకున్నారు!

కొన్నిరోజుల కిందట ఎయిరిండియా సిబ్బందితో గొడవకు దిగిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు.

ముంబై: కొన్నిరోజుల కిందట ఎయిరిండియా సిబ్బందితో గొడవకు దిగిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన పోలీసులతో మాటలయుద్ధానికి దిగారు. మరాఠ్వాటాలోని లాతూర్‌ ప్రాంతంలో ఏటీఎంలలో డబ్బులు లేకపోవడాన్ని నిరసిస్తూ ఆయన పోలీసులతో వాడీవేడి వాగ్వాదానికి దిగారు.

పోలీసులను గట్టిగా వారిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటీఎంలలో డబ్బు లేదని శివసేన శ్రేణులు నిరసన తెలుపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గైక్వాడ్‌ గతంలో ఎయిరిండియా సిబ్బందితో గొడవపడి.. మేనేజర్‌ను కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో బిత్తరపోయిన ఎయిరిండియా ఆయనపై విమానాలు ఎక్కకుండా నిషేధం విధించింది. శివసేన ఎంపీలతో నిరసన, ఒత్తిడితో ఈ బహిష్కరణ ఎయిరిండియా తర్వాత వెనుకకు తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement