'అలంను అందుకే విడుదల చేశాం' | Kashmir govt letter to central government due to Musarat Alam | Sakshi
Sakshi News home page

'అలంను అందుకే విడుదల చేశాం'

Mar 12 2015 1:47 PM | Updated on Aug 20 2018 9:16 PM

'అలంను అందుకే విడుదల చేశాం' - Sakshi

'అలంను అందుకే విడుదల చేశాం'

వేర్పాటు వాది ఆలంను నిర్భందించి ఉంచడానికి తమ ప్రభుత్వానికి ఎలాంటి కారణాలు కనిపించలేదని కాశ్మీర్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

కాశ్మీర్: వేర్పాటు వాది మసారత్ అలంను నిర్భందించి ఉంచడానికి తమ ప్రభుత్వానికి ఎలాంటి కారణాలు కనిపించలేదని కాశ్మీర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకే అతడిని విడుదల చేశామని ప్రకటించింది. వేర్పాటు వాది మసారత్ అలం విడుదలపై కేంద్ర హోంశాఖ రాసిన లేఖకు కాశ్మీర్ ప్రభుత్వం గురువారం పైవిధంగా స్పందించింది.

వేర్పాటు వాది మసారత్ అలం విడుదలపై పార్లమెంట్ ఉభయ సభలను ప్రతిపక్షాలు స్తంభింపచేశాయి. అలం విడుదలపై వెంటనే జవాబు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కాశ్మీర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దాంతో కాశ్మీర్ ప్రభుత్వం పైవిధంగా స్పందించింది.  

ఇటీవలే కాశ్మీర్లో బీజేపీ మద్దతుతో పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పీడీపీకి చెందిన ముఫ్తీ మహమద్ సయిద్ కాశ్మీర్ సీఎంగా పాలన పగ్గాలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో ఎన్నికలు శాంతయుతంగా జరిగాయంటే అందుకు కారణం తీవ్రవాదులు, పొరుగు దేశమైన పాకిస్థాన్ అంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement