టీడీపీ తెలుగు డ్రామా పార్టీగా మారింది: జనక్‌ప్రసాద్‌ | Janaka prasad takes on Congress party | Sakshi
Sakshi News home page

టీడీపీ తెలుగు డ్రామా పార్టీగా మారింది: జనక్‌ప్రసాద్‌

Dec 10 2013 5:13 PM | Updated on Mar 18 2019 7:55 PM

టీడీపీ తెలుగు డ్రామా పార్టీగా మారింది: జనక్‌ప్రసాద్‌ - Sakshi

టీడీపీ తెలుగు డ్రామా పార్టీగా మారింది: జనక్‌ప్రసాద్‌

రాష్ట్రవిభజనపై కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై సీమాంధ్ర నుంచి సర్వత్రా విమర్శలు తలెత్తాయి.

హైదరాబాద్: రాష్ట్రవిభజనపై కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై సీమాంధ్ర నుంచి సర్వత్రా విమర్శలు తలెత్తాయి.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్‌ప్రసాద్‌ మండిపడ్డారు.  కేంద్రం, రాష్ట్రంలో అసమర్ధ ప్రభుత్వం పాలిస్తుందంటూ దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా ఆర్టికల్‌ 3పై... ఏకాభిప్రాయానికి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేసారని చెప్పారు.

కేంద్రం విభజన చేస్తుంటే.. చంద్రబాబు సమైక్యం అనే మాట ఎందుకు మాట్లాడటంలేదని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. టీడీపీ తెలుగు డ్రామా పార్టీగా మారిందని ఆయన ఎద్దెవా చేశారు. చంద్రబాబు మీకు చిత్తశుద్ది ఉంటే గతంలో తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ ఉపసంహరించుకోండని జనక్‌ప్రసాద్‌ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement