'48 గంటలు గడిస్తే కానీ చెప్పలేం..' | Indrani Mukherjea's condition critical, says JJ hospital doctors | Sakshi
Sakshi News home page

'48 గంటలు గడిస్తే కానీ చెప్పలేం..'

Oct 3 2015 4:22 PM | Updated on Sep 3 2017 10:23 AM

'48 గంటలు గడిస్తే కానీ చెప్పలేం..'

'48 గంటలు గడిస్తే కానీ చెప్పలేం..'

షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీయా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ముంబై జేజే ఆస్పత్రి వైద్యులు చెప్పారు.

ముంబై: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీయా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ముంబై జేజే ఆస్పత్రి వైద్యులు చెప్పారు. 48 గంటలు గడిస్తే కానీ ఆమె పరిస్థితిని చెప్పలేమని వైద్యులు తెలిపారు.

షీనాబోరా హత్య కేసులో బైకలా జైల్లో రిమాండ్లో ఉన్న ఇంద్రాణి అపస్మారక స్థితికి చేరుకోవడంతో శుక్రవారం జేజే ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. ఆమె మోతాదుకు మించి నిద్రమాత్రలు వాడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జేజే ఆస్పత్రి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. ఇటీవలే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement