భోపాల్ ఎన్కౌంటర్.. చర్లపల్లి జైలులో అలర్ట్ | in sight of Bhopal encounter, high alert at Cherlapally central jail | Sakshi
Sakshi News home page

భోపాల్ ఎన్కౌంటర్.. చర్లపల్లి జైలులో అలర్ట్

Nov 1 2016 10:01 PM | Updated on Sep 4 2017 6:53 PM

భోపాల్ ఎన్కౌంటర్.. చర్లపల్లి జైలులో అలర్ట్

భోపాల్ ఎన్కౌంటర్.. చర్లపల్లి జైలులో అలర్ట్

భోపాల్‌ ఎన్కౌంటర్ నేపథ్యంలో చర్లపల్లి సెంట్రల్ జైలు అదికారులు అప్రమత్తమయ్యారు.

హైదరాబాద్‌: భోపాల్‌ సెంట్రల్ జైలు గార్డును హతమార్చి ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులు తప్పించుకోవడం, కొద్ది గంటల్లోనే వారంతా పోలీసుల చేతిలో హతమైపోయిన నేపథ్యంలో దేశంలోని అన్ని సెంట్రల్ జైళ్లలో అలర్ట్ ప్రకటించారు. ఇటు హైదరాబాద్ శివారులోని చర్లపల్లి సెంట్రల్ జైలు అదికారులు కూడా అప్రమత్తమయ్యారు.

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు ఐఎస్‌ఐ తీవ్రవాదులు చర్లపల్లి జైలులోనే విచారణ ఖైదీలుగా ఉన్న సంగతి తెలిసిందే. నిందితులున్న మంజీర బ్యారక్‌లో షిఫ్టుకు ఐదుగురు వార్డర్ల చొప్పున జైలర్‌ స్థాయి అధికారి నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఖైదీల కదలికలపై జైళ్లశాఖ ఉన్నతాధికారులతో ..ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆరా తీశారు. ఈ ఖైదీల విచారణకు ప్రత్యేకంగా జైలులోని కోర్టు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement