భారత్‌లో రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్ పారిపోయిన విజయ్ మాల్యా మరోసారి తాను నిర్దోషినని వాదించారు.
లండన్: భారత్‌లో రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్ పారిపోయిన విజయ్ మాల్యా మరోసారి తాను నిర్దోషినని వాదించారు. అప్పగింత కేసులో విచారణ ఎదుర్కొనేందుకుగానూ మంగళవారం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టుకు హాజరైన ఆయన వీలేకరులతో మాట్లాడారు.
భారత ప్రభుత్వం తనపై మోపిన అభియోగాలన్నీ నిరాధారమైనవని, తాను ఎలాంటి మోసాలకు పాల్పడలేదని మాల్యా చెప్పుకొచ్చారు. మాల్యా అప్పగింత ప్రక్రియకు సంబంధించి భారత్ ఇదివరకే అన్ని ఆధారాలను సమర్పించిన దరిమిలా కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.