మద్యం మత్తులో భార్యపై బాణంతో దాడి | Husband attack on wife with arrow in drunken | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో భార్యపై బాణంతో దాడి

Aug 11 2015 7:06 PM | Updated on Jul 18 2019 2:26 PM

జీకేవీధి మండలం లంకపాకలు గ్రామంలో ఓ భర్త భార్యపై బాణంతో దాడి చేశాడు.

విశాఖపట్నం(జీకేవీధి): జీకేవీధి మండలం లంకపాకలు గ్రామంలో ఓ భర్త భార్యపై బాణంతో దాడి చేశాడు. లంకపాకలు గ్రామానికి చెందిన సుభద్ర, పాండురాజు భార్యాభర్తలు. పాండురాజు తరచూ తాగి వచ్చి భార్యతో గొడవపడుతుంటాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన పాండు తన వెంట తెచ్చుకున్న బాణంతో ఆమె కంటిలో పొడిచాడు.

ఈ ఘటనలో సుభద్ర కంటిపై భాగంలో గాయమైంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement