breaking news
GK street
-
నలుగురు ఫీల్డ్మెన్లకు మావోల దేహశుద్ధి
జీకే వీధి(విశాఖపట్టణం జిల్లా): విశాఖపట్టణం జిల్లా జీకే వీధి మండలం పెద్దవలస కాఫీ ఎస్టేట్లో పనిచేసే నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లకు శనివారం రాత్రి మావోయిస్టులు దేహశుద్ధి చేశారు. కాఫీ తోటలను గిరిజనులకు అప్పగించాలని చాలా రోజులుగా మావోలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం సరిగా స్పందించలేదు. దాంతో నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లకు దేహశుద్ధిచేసి వదిలిపెట్టారు. -
మద్యం మత్తులో భార్యపై బాణంతో దాడి
విశాఖపట్నం(జీకేవీధి): జీకేవీధి మండలం లంకపాకలు గ్రామంలో ఓ భర్త భార్యపై బాణంతో దాడి చేశాడు. లంకపాకలు గ్రామానికి చెందిన సుభద్ర, పాండురాజు భార్యాభర్తలు. పాండురాజు తరచూ తాగి వచ్చి భార్యతో గొడవపడుతుంటాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన పాండు తన వెంట తెచ్చుకున్న బాణంతో ఆమె కంటిలో పొడిచాడు. ఈ ఘటనలో సుభద్ర కంటిపై భాగంలో గాయమైంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.