breaking news
king gerge hospital
-
ప్రసవాల్లో కింగ్‌జార్జి ఆసుపత్రి అరుదైన ఘనత
విశాఖపట్నంలోని కింగ్‌జార్జి (కేజీహెచ్) ఆస్పత్రి రాష్ట్రంలోనే ఎక్కువ ప్రసవాలు చేస్తున్న ఆస్పత్రిగా ఘనత సాధించింది. 2020–21లో ఇక్కడ సగటున రోజుకు 33.70 ప్రసవాలు చేశారు. 33.56 ప్రసవాలతో తిరుపతి మెటర్నిటీ ఆస్పత్రి రెండోస్థానంలో నిలిచింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏటా సుమారు 3 లక్షల ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లో జరుగుతుండగా, అందులో లక్ష ప్రసవాలు బోధనాసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. మిగతా రెండు లక్షల ప్రసవాలు జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులతో పాటు 195 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో జరుగుతున్నాయి. బోధనాసుపత్రుల్లో అత్యల్పంగా ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో రోజుకు 1.72 ప్రసవాలు మాత్రమే జరుగుతున్నట్లు తాజా గణాంకాల్లో తేలింది. పీహెచ్‌సీల్లో కోసిగి టాప్.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కర్నూలు జిల్లా కోసిగి పీహెచ్సీ ఆదర్శంగా నిలిచింది. ఏడాదిలో ఇక్కడ 1,578 ప్రసవాలు నిర్వహించారు. అత్యధిక ప్రసవాలు చేస్తున్న 10 పీహెచ్సీలలో ఆరు పీహెచ్‌సీలు కర్నూలు జిల్లాలోనే ఉండటం గమనార్హం. కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సగటున రోజుకు 4.32 ప్రసవాలు జరుగుతున్నాయి. రెండో స్థానంలో ఉన్న ఆదోని పరిధిలోని పెద్దతుంబళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏడాదికి 1,302 ప్రసవాలు చేస్తోంది. అంటే రోజుకు 3.57 ప్రసవాలు జరుగుతున్నాయి. అలాగే, పెద్దకడుబూరు, బేతంచెర్ల, కౌతాళం వంటి ఎక్కువ ప్రసవాలు జరిగే పీహెచ్‌సీలు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ ఏడాదికి వంద అంతకంటే ఎక్కువ ప్రసవాలు 96 పీహెచ్‌సీల్లో జరుగుతున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో 2.83 లక్షల ప్రసవాలు.. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 2020–21లో 2.83 లక్షల ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లో జరిగాయి. అందులో సింహభాగం బోధనాసుపత్రుల్లో జరగ్గా, ఆ తర్వాత స్థానం సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కువ డెలివరీలు జరిగాయి. ప్రస్తుతం 1,149 పీహెచ్‌సీల్లో 200 పైచిలుకు పీహెచ్‌సీల్లో మాత్రమే ప్రసవాలు జరుగుతున్నాయి. ఇకపై అన్ని పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు జరపాలని కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా వైద్యులు, స్టాఫ్ నర్సులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఎక్కడ ఎన్ని ప్రసవాలు కేటగిరీ ప్రసవాలు బోధనాసుపత్రులు 88,684 జిల్లా ఆస్పత్రులు 42,061 ఏరియా ఆస్పత్రులు 38,883 సీహెచ్‌సీలు 73,258 పీహెచ్‌సీలు 40,877 బోధనాసుపత్రుల్లో ప్రసవాలు ఇలా ఆస్పత్రి ఏడాదిలో ప్రసవాలు రోజుకు సగటున కింగ్‌జార్జి విశాఖ 12,301 33.70 మెటర్నిటీ, తిరుపతి 12,249 33.56 జీజీహెచ్, కాకినాడ 9,375 25.68 జీజీహెచ్, విజయవాడ 9,279 25.47 జీజీహెచ్, గుంటూరు 8,771 24.03 జీజీహెచ్, అనంతపురం 8,093 22.17 జీజీహెచ్, కర్నూలు 7,928 21.72 జీజీహెచ్, కడప 7,290 19.97 జీజీహెచ్, నెల్లూరు 5,210 14.27 జీజీహెచ్, శ్రీకాకుళం 3,329 9.12 జీజీహెచ్, ఒంగోలు 628 1.72 -
మద్యం మత్తులో భార్యపై బాణంతో దాడి
విశాఖపట్నం(జీకేవీధి): జీకేవీధి మండలం లంకపాకలు గ్రామంలో ఓ భర్త భార్యపై బాణంతో దాడి చేశాడు. లంకపాకలు గ్రామానికి చెందిన సుభద్ర, పాండురాజు భార్యాభర్తలు. పాండురాజు తరచూ తాగి వచ్చి భార్యతో గొడవపడుతుంటాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన పాండు తన వెంట తెచ్చుకున్న బాణంతో ఆమె కంటిలో పొడిచాడు. ఈ ఘటనలో సుభద్ర కంటిపై భాగంలో గాయమైంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.