ములాయంను ఎదిరిస్తే అంతే...! | government registered a case of rape against IPS officer | Sakshi
Sakshi News home page

ములాయంను ఎదిరిస్తే అంతే...!

Jul 13 2015 1:19 AM | Updated on Sep 3 2017 5:23 AM

ములాయంను ఎదిరిస్తే అంతే...!

ములాయంను ఎదిరిస్తే అంతే...!

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ నుంచి తనకు ముప్పు ఉందంటూ ఫిర్యాదు చేసిన ఓ ఐపీఎస్ అధికారిపై

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ నుంచి తనకు ముప్పు ఉందంటూ ఫిర్యాదు చేసిన ఓ ఐపీఎస్ అధికారిపై ప్రభుత్వం అత్యాచారం కేసును నమోదు చేసింది. ఐజీ ర్యాంకు అధికారి అయిన అమితాబ్ ఠాకూర్ శనివారం తన మాట వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ములాయం బెదిరిస్తున్నారని కేసు పెట్టారు.

దీనికి ప్రతిగా ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ ఏడు నెలల క్రితం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అమితాబ్ ఠాకూర్‌పై రేప్ కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో ఠాకూర్ భార్య నూతన్‌ను కూడా నిందితురాలిగా పేర్కొన్నారు.2014నవంబర్‌లో నూతన్ ఘజియాబాద్ పర్యటించి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారనీ, డిసెంబర్ 31న ఆయన ఇంటికి వెళ్లినప్పుడు అత్యాచారానికి ఒడిగట్టారని ఆరోపించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement