మరణించిన అధికారికి బదిలీ! | Excise official 'transferred' a year after his death | Sakshi
Sakshi News home page

మరణించిన అధికారికి బదిలీ!

Jul 6 2016 12:30 PM | Updated on Sep 4 2017 4:16 AM

మరణించిన అధికారికి బదిలీ!

మరణించిన అధికారికి బదిలీ!

ఎక్సైజ్ శాఖలో ఎస్సైగా పనిచేసిన ఓ అధికారి మరణించి ఏడాది కాలం గడిచిన తర్వాత అతనికి బదిలీ ఉత్తర్వులు రావడంతో ఎక్సైజ్ శాఖ విచారణకు ఆదేశించింది.

ముంబై: ఎక్సైజ్ శాఖలో ఎస్సైగా పనిచేసిన ఓ అధికారి మరణించి ఏడాది కాలం గడిచిన తర్వాత ఆయనను ఫ్లయింగ్ స్క్వాడ్ కు బదిలీ చేస్తున్నామంటూ లేఖ వెళ్లింది. గతంలో కొల్హపూర్ లో ఎస్ఎమ్ సబ్లే ఇన్ స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. సబ్లేను నాసిక్ జిల్లాలోని సతనా ప్రాంతానికి ఫ్లయింగ్ స్క్వాడ్ గా బదిలీ చేస్తూ జాయింట్ కమిషనర్ తనూజా దండేకర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

సబ్లేను వీలైనంత త్వరగా కొల్హపూర్ లో విధుల నుంచి రిలీవ్ చేసి సతనాకు పంపాలని కొల్హపూర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు ఉత్తర్వులో సూచించారు. సబ్లే కొల్హపూర్ లోనే ఉండటానికి ప్రయత్నిస్తే అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులలో పేర్కొన్నారు. మరణించిన అధికారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు రావడం, పైగా ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాననడం.. ఈ వ్యవహారాలపై ఎక్సైజ్ కమిషనర్ విజన్ సింఘాల్ విచారణకు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement