సూపర్ స్టార్ల శకం ముగిసింది: అక్షయ్ కుమార్ | Era of films on big stars popularity is gone: Akshay Kumar | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్ల శకం ముగిసింది: అక్షయ్ కుమార్

Sep 26 2013 12:24 PM | Updated on Apr 3 2019 6:34 PM

సూపర్ స్టార్ల శకం ముగిసింది: అక్షయ్ కుమార్ - Sakshi

సూపర్ స్టార్ల శకం ముగిసింది: అక్షయ్ కుమార్

స్టార్ హీరోల పాపులారిటీని బట్టి సినిమాలు చూసే కాలం పోయిందని, కథాబలమున్న వాటినే అభిమానులు ఆదరిస్తున్నారని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

స్టార్ హీరోల పాపులారిటీని బట్టి సినిమాలు చూసే కాలం పోయిందని, కథాబలమున్న వాటినే అభిమానులు ఆదరిస్తున్నారని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఓ సినిమాలో పెద్ద హీరో ఉన్నంత మాత్రనే హిట్ కాదన్నారు. స్టార్ హీరోలు నటించిన సినిమాలూ కొన్ని సందర్భాల్లో నిరాదరణకు గురవుతుంటాయని తెలిపారు. ప్రేక్షకులు ప్రస్తుతం మంచి చిత్రాలనే ఆదరిస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ చెప్పారు. కథ, స్ర్కిప్ట్ బాగుంటే సినిమా హిట్ అవుతుందన్నారు.  

నటుల్ని చిన్న పెద్ద తేడాలుగా విభజించడం సరికాదని అక్షయ్ చెప్పారు. ఏ హీరోనూ తక్కువగా అంచనా వేయరాదన్నారు. తాను సహనటులతో ఇలాగే వ్యవహరిస్తానని తెలిపారు. మలయాళీ సినిమా 'పోకిరి రాజా' బాలీవుడ్ రీమేక్లో అక్షయ్ నటిస్తున్నారు. 'ఈ సినిమా చూడగానే నాకు నచ్చింది. కామెడీ, యాక్షన్కు స్కోప్ ఉన్న సినిమా. తండ్రి, ఇద్దరు కొడుకులకు సంబంధించిన కథ ఇది' అని అక్షయ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement