డీఎస్‌కే మోటో వీల్స్ నుంచి బెనెల్లీ సూపర్ బైక్‌లు | DSK Benelli Launches 5 Bikes in India; Prices Start at Rs. 2.83 Lakh | Sakshi
Sakshi News home page

డీఎస్‌కే మోటో వీల్స్ నుంచి బెనెల్లీ సూపర్ బైక్‌లు

Mar 20 2015 12:50 AM | Updated on Sep 2 2017 11:06 PM

డీఎస్‌కే మోటో వీల్స్ నుంచి బెనెల్లీ సూపర్ బైక్‌లు

డీఎస్‌కే మోటో వీల్స్ నుంచి బెనెల్లీ సూపర్ బైక్‌లు

డీఎస్‌కే మోటోవీల్స్ కంపెనీ ఐదు సూపర్ బైక్‌లను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఇటలీకి చెందిన బెనెల్లీ భాగస్వామ్యంతో

ధరలు రూ. 2.83 లక్షల నుంచి రూ.11.81 లక్షల రేంజ్‌లో
 త్వరలో హైదరాబాద్‌లో డీలర్షిప్ ఏర్పాటు
 
 ముంబై: డీఎస్‌కే మోటోవీల్స్ కంపెనీ ఐదు సూపర్ బైక్‌లను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఇటలీకి చెందిన  బెనెల్లీ భాగస్వామ్యంతో ఈ సూపర్ బైక్‌లను అందిస్తున్నామని డీఎస్‌కే మోటోవీల్స్ చైర్మన్ శిరీష్ కులకర్ణి చెప్పారు. ఈ సూపర్ బైక్‌ల ధరలు రూ.2.83 లక్షల నుంచి రూ.11.81 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)రేంజ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వివిధ పన్నుల కారణంగా ముంబైలో వీటి ధరలు 4-5 శాతం రేంజ్‌లో అధికంగా ఉంటాయని వివరించారు.తొలి ఏడాదిలో 3,000 సూపర్ బైక్‌లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఏడాది చివరకు మరిన్ని మోడళ్లను తేనున్నామని వివరించారు.
 
 ఈ సూపర్ బైక్‌లను (300 సీసీ టీఎన్‌టీ 302, 600 సీసీ టీఎన్‌టీ 600ఐ,టీఎన్‌టీ 600 జీటీ, 898 సీసీ టీఎన్‌టీ 899, 1131 సీసీ టీఎన్‌టీ ఆర్) అసెంబుల్ చేయడానికి రూ.200 కోట్లు పెట్టుబడులతో పుణేలో ప్లాంట్ ఏర్పాటు చేశామని వివరించారు. భారత్‌లో సూపర్ బైక్ మార్కెట్ జోరుగా వృద్ధి చెందుతోందని తెలిపారు. త్వరలో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణే, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కత, గోవాల్లో డీలర్లను నియమిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత టైర్ టూ, టైర్ త్రీ నగరాలకు విస్తరిస్తామని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement