సేఫ్టీ ఫీచర్స్‌తో కొత్త టీవీఎస్ స్కూటర్‌..ధర ఎంత? | BS IV Compliant TVS Jupiter Launched: Prices Start At 49,666 | Sakshi
Sakshi News home page

సేఫ్టీ ఫీచర్స్‌తో కొత్త టీవీఎస్ స్కూటర్‌..ధర ఎంత?

Mar 14 2017 8:30 PM | Updated on Sep 5 2017 6:04 AM

సేఫ్టీ ఫీచర్స్‌తో  కొత్త  టీవీఎస్ స్కూటర్‌..ధర ఎంత?

సేఫ్టీ ఫీచర్స్‌తో కొత్త టీవీఎస్ స్కూటర్‌..ధర ఎంత?

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీదారు టీవీఎస్‌ కొత్త స్కూటర్‌ను మంగళవారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీదారు  టీవీఎస్‌ కొత్త స్కూటర్‌ను మంగళవారం  భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.   పాపులర్‌ 110 సీసీ స్కూటర్‌ ఉత్పత్తి సంస్థ అయిన టీసీఎస్‌  జూపిటర్‌  కొత్త అప్‌డేటెడ్‌ వెర్షన్‌ ను లాంచ్‌ చేసింది.  జూపిటర్ వేరియంట్‌లో బీఎస్‌(భారత్ స్టాండర్డ్స్)-4 ప్రమాణాలతో కొత్త వాహనాన్ని అందుబాటులోకి  తీసుకొచ్చింది.  ఈ బీఎస్-4 జూపిటర్ మోడల్ ఎక్స్ షోరూం  ప్రారంభ ధర రూ. 49,666 గా కంపెనీ నిర్ణయించింది.  అలాగే  ఇప్పటికే అందుబాటులో ఉన్న రంగులతోపాటు అదనంగా   జేడ్ గ్రీన్.. మిస్టిక్ గోల్డ్ కలర్స్‌లో ఈ టూ వీలర్‌ అందుబాటులో ఉండనుంది.

ఇతర 110 సిసి  సిబ్లింగ్స్‌తోపాటు ఈ రీమోడల్ చేసిన ఈ స్కూటర్ కొత్త  సేఫ్టీ పద్ధతుల్లోలాంచ్‌ అయింది.  ముఖ్యంగా  హెడ్‌లైట్ ఆటోమేటిక్‌గా ఆన్‌లోనే ఉండనుంది. అలాగే సింక్రొనైజ్జ్ బ్రేకింగ్ సిస్టంను అమర్చింది.  గతంలో జెడ్ఎక్స్ రేంజ్‌లోనే ఈ బ్రేకింగ్ సిస్టం (డిస్క్ బ్రేక్) అందుబాటులో ఉండగా.. ఇప్పుడు బేస్ వేరియంట్‌లో కూడా అమర్చడం విశేషం. కాగా టీవీఎస్  బిఎస్-4 కంప్లైంట్ ఇంజీన్‌ తో లాంచ్‌ చేసిన స్కూటర్లలో వెగో తరువాత జూపిటర్‌ రెండవది.  అయితే బిఎస్-4 కంప్లైంట్ ఇంజన్‌ తో  డిస్క్ బ్రేక్ తో టాప్ ఆఫ్ ది లైన్ జెట్‌ ఎక్స్‌  వేరియంట్  రూ. 53.666  (అన్ని ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరలో ఎలాంటి మార్పుఉండదని టీవీఎస్‌ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement