ట్విట్టర్ సీఈవో అకౌంట్ కూడా.. | Sakshi
Sakshi News home page

ట్విట్టర్ సీఈవో అకౌంట్ కూడా..

Published Sat, Jul 9 2016 6:06 PM

ట్విట్టర్ సీఈవో అకౌంట్ కూడా..

ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ ట్విట్టర్ అకౌంట్ కూడా శనివారం హ్యాకింగ్కు గురయింది. ఇటీవలే ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ల సోషల్ మీడియా అకౌంట్లను అవర్ మైన్ గ్రూప్ హ్యాక్ చేసిన విషయం తెలిసిందే.
 
జాక్ డార్సీ ట్విట్టర్ అకౌంట్ ను అవర్ మైన్ గ్రూప్ హ్యాక్ చేసి, అదే అకౌంట్లో హ్యక్ చేసినట్టు వెల్లడించింది. జాక్ డార్సీ ఫాలోవర్స్ 3.73 మిలియన్ల మందికి ఈ హ్యాకింగ్ విషయాన్ని అవర్ మైన్ ప్రచారం చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ లను తొలగించినా.. ఆ హ్యాకింగ్ స్క్రీన్ షాట్ లు బయటికి వెల్లడించింది.


కానీ ఈ గ్రూప్ అకౌంట్ల హ్యాకింగ్ కు ఎలా పాల్పడుతుందో క్లియర్ గా తెలియడం లేదు. సోషల్ నెట్ వర్క్ ల సిస్టమ్ దొంగతనం వల్ల హ్యాకింగ్ కు పాల్పడటం లేదని మాత్రం తెలిసింది. అయితే అవర్ మైన్ గ్రూప్, తనకు తాను భద్రతా సంస్థగా అభివర్ణించుకుంటోంది. ఈ హ్యాకింగ్ ఘటనలు మళ్లీ జరగకుండా, సర్వీసులను ఆఫర్ చేస్తుందని వెల్లడిస్తోంది. వెబ్ సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లు, కంపెనీల భద్రతా వలయాలను స్కాన్ చేసి, తన సైట్ లో భద్రతకు సంబంధించి ప్రచార సేవలను అందిస్తున్నట్టు చెబుతోంది.

Advertisement
Advertisement