తొలిసారిగా నిశ్శబ్ద ఎమ్మారై | Amrita Hospital first in the country to use Silent MRI | Sakshi
Sakshi News home page

తొలిసారిగా నిశ్శబ్ద ఎమ్మారై

Feb 28 2014 3:45 PM | Updated on Sep 2 2017 4:12 AM

ఏమాత్రం శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకెళ్లిపోయే ఎమ్మారైని తొలిసారిగా కొచ్చిలోని అమృతా హాస్పిటల్లో ఏర్పాటు చేశారు.

ఎప్పుడైనా మీరు ఎమ్మారై తీయించుకోవడం గానీ, ఎవరికైనా దగ్గరుండి తీయించడం గానీ జరిగిందా? ఆ సమయంలో దాదాపు చిన్న స్థాయి విమానం వెళ్తున్నంత శబ్దం వస్తుంటుంది. కానీ అసలు ఏమాత్రం శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకెళ్లిపోయే ఎమ్మారైని తొలిసారిగా కొచ్చిలోని అమృతా హాస్పిటల్లో ఏర్పాటు చేశారు. జీఈ కంపెనీ రూపొందించిన ఈ సైలెంట్ స్కాన్ టెక్నాలజీతో అసలు శబ్దం చేయని ఎమ్మారైని అమృతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఎంఎస్)లో ఏర్పాటుచేశారు. సాధారణ ఎమ్మారైల నుంచి 110 డెసిబుల్స్ శబ్దం వస్తుంది. ఇది స్టీలు మిల్లు నడుస్తున్నప్పుడు, లేదా విమానం ఇంజన్ వస్తున్నప్పుడు, బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు వెలువడే శబ్దానికి సమానం.

కొత్త ఎమ్మారై యంత్రం మాత్రం అస్సలు శబ్దమన్నదే చేయకుండా కామ్గా ఉంటుందని జీఈ హెల్త్ కేర్ ఎమ్మారై ఇమేజింగ్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ కార్తీక్ కుప్పుస్వామి తెలిపారు. దీనివల్ల రోగులకు ప్రశాంతంగా ఉంటుందని, ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఆయన అన్నారు. ఎమ్మారై తీయించుకునేటప్పుడు రోగి ఏమాత్రం కదిలినా.. దాని రిపోర్టు నాణ్యతలో తేడా వస్తుంది. శబ్దం రావడం వల్ల రోగి అసౌకర్యంగా ఫీలై.. ఎంతో కొంత కదులుతారు. ఆ సమస్య ఈ సైలెంట్ ఎమ్మారైతో ఉండబోదని అంటున్నారు. ఈ కొత్త మిషన్ను మెదడుతో పాటు కాలేయం స్కానింగ్కు కూడా ఉపయోగించవచ్చట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement