ప్రతి 20 నిమిషాలకో అత్యాచారం!! | A rape for every 20 minutes, says national crime records bureau | Sakshi
Sakshi News home page

ప్రతి 20 నిమిషాలకో అత్యాచారం!!

Dec 17 2013 12:59 PM | Updated on Jul 28 2018 8:35 PM

ప్రతి 20 నిమిషాలకో అత్యాచారం!! - Sakshi

ప్రతి 20 నిమిషాలకో అత్యాచారం!!

మన దేశంలో ప్రతి 20 నిమిషాలకు ఓ మహిళ అత్యాచారానికి గురవుతోంది. ప్రతి 53 నిమిషాలకు ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారు.

మన దేశంలో ప్రతి 20 నిమిషాలకు ఓ మహిళ అత్యాచారానికి గురవుతోంది. ప్రతి 53 నిమిషాలకు ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిర్భయ చట్టం కింద ఈ ఏడాది 110 కేసులు నమోదయ్యాయి. వాటిలో అత్యధికం విద్యాధికులు, ఉన్నత ఉద్యోగులు ఉండే మాదాపూర్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. మొత్తం 110 కేసులకు గాను 15 కేసులు మాదాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోనే నమోదయ్యాయి. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరోతో పాటు మన రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న నేరాల తీరు నానాటికీ పెచ్చుమీరుతోంది. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధించడం, అవకాశం దొరికితే అత్యాచారాలకు పాల్పడటం లాంటివి ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి.

ఈ క్రమంలో ఆపదసమయంలో ఆత్మరక్షణకోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా అనేక వాటి మీద హైదరాబాద్లో సంకల్ప్ ఉమెన్ స్పోర్ట్స్ అలయన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. మహిళలపై జరిగిన లైంగిక దాడుల్లో 80 శాతం పోలీస్ స్టేషన్ వరకు రావు. నిర్భయ ఘటన తర్వాత ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై దారుణాలు తగ్గడం లేదు.  ఈ పరిస్థితిలో మహిళలకు కరాటే, కుంగ్ ఫూ వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం మంచిదని మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ బాబు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement